అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 10 మంది మృతి!.. చైనా న్యూ ఇయర్ ఈవెంట్ ప్లేస్‌లో ఘటన..

Published : Jan 22, 2023, 03:44 PM ISTUpdated : Jan 22, 2023, 03:49 PM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 10 మంది మృతి!.. చైనా న్యూ ఇయర్ ఈవెంట్ ప్లేస్‌లో ఘటన..

సారాంశం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో సామూహిక కాల్పులు చోటుచేసుకున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో సామూహిక కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సామూహిక కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే మృతుల సంఖ్యను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం  ఆస్పత్రులుకు తరలించారు.

లాస్ ఏంజిల్స్‌కు తూర్పున 13 కి. మీ దూరంలో మాంటెరీ పార్క్‌ ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే నిందితుడు మెషిన్ గన్‌తో కాల్పులు జరిపాడని.. అతని వద్ద భారీగా మందుగుండు సామాగ్రి ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Summer Tour : మండుటెండల్లో చల్లచల్లని టూర్.. ఈ వేసవిలో తప్పక వెళ్లాల్సిన టాప్ 10 దేశాలు ఇవే..!
Smart Lockdown: మళ్లీ లాక్‌డౌన్! రాత్రి 8 గంటలకే అన్నీ బంద్.. అసలేం జరిగిందంటే.?