కోళ్లను భయపెట్టి చంపేశాడని పొరుగింటి వ్యక్తిపై కేసు.. ఆరు నెలల జైలు శిక్ష

By Mahesh KFirst Published Apr 10, 2023, 1:17 AM IST
Highlights

చైనాలో ఓ వ్యక్తి పొరుగింటికి చెందిన కోళ్లను భయపెట్టి చంపేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. 1,100 కోళ్లను ఫ్లాష్ లైట్‌తో భయపెట్టి చంపేశాడని పొరుగింటి వ్యక్తి ఆరోపించాడు.
 

కోళ్లను భయపెట్టి చంపేశాడని పొరుగింటి వ్యక్తిపై కేసు.. ఆరు నెలల జైలు శిక్ష


న్యూఢిల్లీ: ఇరుగు పొరుగు మధ్య తరుచూ గొడవలు జరగడం.. కలిసి ఉండటం సర్వసాధారణం. కానీ, కొన్ని చిన్న చిన్న విషయాల మీదే ఎక్కువ విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. చైనాకు చెందిన గూ, జోంగ్ అనే ఇద్దరి మధ్య కూడా ఇదే ప్రూవ్ అయింది. పొరుగున ఉండే గూ తన కోళ్లను భయపెట్టి చంపేశాడని జోంగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కేసు పెట్టారు. గూను కోర్టు దోషిగా తేల్చడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. శిక్ష తగ్గిస్తూ కోర్టు ఆరు నెలల ఖైదు విధించింది.

అయితే, ఈ ఇద్దరి మధ్య గొడవ ఏప్రిల్ 2022లోనే మొదలైంది. క్రమంగా అది మరింత తీవ్రమైంది. 2022 ఏప్రిల్‌లో గూకు చెందిన చెట్లను జోంగ్ ఆయన అనుమతి లేకుండానే నరికేశాడు. అప్పటి నుంచి జోంగ్ పై గూకు కోపం పెరుగుతూ వచ్చింది. 

జోంగ్‌ ఓ కోళ్ల ఫాం నడుపుతున్నాడు. గూ ఓ సారి జోంగ్ కోళ్లఫాంలోకి దూరాడు. ఫ్లాష్ లైట్‌తో ఆ కోళ్లను భయపెట్టాడు. ఆ ఫ్లాష్ లైట్‌తో కోళ్లు భయపడి ఒక మూలగా వెళ్లాయి. ఆ గుంపు మొత్తం ఒక వైపు చేరడంతో కొన్ని కోళ్లు క్రష్ అయిపోయి మరణించాయి.

Also Read: ముదురుతున్న ఎండలు.. ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు మార్చిన సీఎం.. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు దాకా

తొలిసారి అలా చేసినప్పుడు 460 కోళ్లు మరణించాయి. పోలీసులు గూను పట్టుకున్నారు. 3,000 యువాన్లు జోంగ్‌కు చెల్లించాలని గూను ఆదేశించారు. దీంతో గూలో అసంతృప్తి మరింత పెరిగింది. మరోసారి ఆయన కోళ్లఫాంలోకి వెళ్లాడు. అదే విధంగా ఫ్లాష్ లైట్‌తో వాటిని భయపెట్టాడు. అప్పుడు 640 కోళ్లు మరణించాయి.

దీంతో మొత్తం 1,100 కోళ్ల విలువను చైనా అధికారులు 13,840 యువాన్లు (1,64,855)గా అంచనా వేశారు. హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్యాంగ్ కోర్టు గును మంగళవారం దోషిగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

click me!