కరోనా ఎఫెక్ట్: క్లినికల్ ట్రయల్స్ ప్రారంబించిన చైనా

Published : Mar 24, 2020, 06:04 PM IST
కరోనా ఎఫెక్ట్: క్లినికల్ ట్రయల్స్ ప్రారంబించిన చైనా

సారాంశం

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. కరోనా మిలటరీ మెడికల్ సైన్సెస్ లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో ఉంది చైనా ప్రభుత్వం.  

బీజింగ్: కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. కరోనా మిలటరీ మెడికల్ సైన్సెస్ లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో ఉంది చైనా ప్రభుత్వం.

ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. చైనాలోనే కరోనా వైరస్ పుట్టింది. చైనా నుండి ఈ వ్యాధి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. అమెరికాలో కూడ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభమయ్యాయి. యూరప్ తో పాటు ఇండియా కూడ వ్యాక్సిన్ తయారు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో చైనా కూడ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది.

Also read:కరోనా దెబ్బకు గుంటూరు మిర్చి యార్డు బంద్... Read more at: https://telugu.asianetnews.com/andhra-pradesh/corona-effect-ap-government-decides-to-close-guntur-mirchi-yard-q7p5ur

చైనాకు చెందిన వెయ్యి మంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు శ్రమిస్తున్నారు. మార్చి 16వ తేదీన తొలిసారిగా క్లినికల్ ట్రయల్ ప్రారంభించారు.  వివిధ వయస్సు ఉన్న వారిని బృందాలుగా విభజించి  క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 18-60 ఏళ్ల వయస్సున్న వారిని 108 మందిని మూడు బృందాలుగా విభజించారు. 

వ్యాదిని నివారించేందుకు వీరిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అయితే మూడు బృందాలకు భిన్నమైన డోసులను ఇచ్చారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారంతా కూడ వ్యూహన్ నగరానికి చెందినవారే.

క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన వారిలో కొంత అనారోగ్య లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?