బ్రేకింగ్... చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి

By telugu news team  |  First Published Mar 24, 2020, 2:17 PM IST

ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.


చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ తోనే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4లక్షల మంది ఈ వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. మిగిలిన ప్రజలు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనితోనే చస్తుంటో.. మరో వైరస్ మొదలైంది. అది కూడా చైనాలోనే మొదలు కావడం గమనార్హం.

Also Readప్రపంచం విలవిల: 15 వేలు దాటిన కరోనా మృతులు...

Latest Videos

తాజాగా చైనాలో హంటా వైరస్‌ వెలుగు చూసింది. ఇది ఎలుకల్లో పుట్టుకొచ్చే వైరస్‌. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.

చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. సుమారు 33 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్‌కు చేరుకుంది. ఈ బస్సులో యునాన్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను మరణించాడు.
 

click me!