
న్యూఢిల్లీ: మనం సాధారణంగా విద్యుత్ కోతల గురించి వింటూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ కలకలం రేపిన అంశం ఇది. విద్యుత్ కృత్రిమం. దాన్ని ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ, విద్యుత్ కోతల్లాగే.. వాటర్ కోతల గురించి ఎప్పుడైనా విన్నారా? చిలీ దేశంలో ఇప్పుడు వాటర్ కోతలూ అమలు చేస్తున్నారు. శాంటియాగో 13 ఏళ్లుగా కరువుతో అల్లాడిపోతున్నది. 491 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎన్నడూ ఎరుగని సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
చిలీ దక్షిణ అమెరికా దేశం. దాని రాజధాని శాంటియాగో. సాధారణంగా ఏ దేశంలోనైనా రాజధానిలో మెరుగైన మౌలిక వసతులను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, 60 లక్షల జనాభా గల శాంటియాగోలో నీటి చుక్కల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. శాంటియాగో నగరం మీదుగా రెండు నదులు వెళ్తుంటాయి. మాపోచో, మాయిపో నదులు. మాపోచో నది శాంయాగో తూర్పు నుంచి పశ్చిమ వైపు వెళ్తున్నది. ఈ నది ద్వారా 1,42,000 కుటుంబాలకు నీటిని అందిస్తుంటారు. కాగా, దక్షిణ నగరంలో నివాసం ఉండే 15.45 లక్షల
కుటుంబాలకు మాయిపో నది దాహార్తి తీరుస్తుంది.
నదులకూ వర్షాలు అతి కీలకమైన వనరు. ఇక్కడ వర్షాపాతం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో నదుల ప్రవాహాలు భారీగా తగ్గిపోయాయి. పర్యావరణ మార్పుల కారణంగా శాంటియాగోలో నది నీటి మట్టం పెరిగిపోవడంతో దాని మీద ఆధారపడే శాంటియాగో నగరవాసులకు నీటి సమస్యలు అధికం కాసాగాయి.
13 ఏళ్లపాటు కరువు కాటేస్తుండటంతో నిత్య జీవితంలో తప్పక అవసరమైన నీటి కొరత పెద్ద సమస్యగా మారింది. అందుకే అక్కడి అధికారులు ఉన్న నీటి వనరులను క్రమబద్ధీకరించి వినియోగించుకోవాల్సిందిగా భావించారు. అందుకే విద్యుత్ కోతల్లాగే.. నీటి కోతలు విధించాలని ప్లాన్ వేశారు.
ఈ ప్రణాళిక నాలుగు అంచెలుగా ఉంటుంది. తొలి అంచెగా గ్రీన్ అలర్ట్. నీటిని పొదుపుగా వాడుకోవాలనే సూచన ఇస్తారు. గ్రౌండ్ వాటర్ వినియోగించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక పోతే రెండో అంచె ఎల్లో అలర్ట్. ఇది నీటి పంపిణీని చేయడానికి ఇచ్చే ప్రెషర్‌ను తగ్గిస్తారు. అయితే, నిజంగా సమస్య రెడ్ అలర్ట్‌తోనే మొదలు అవుతుంది. రెడ్ అలర్ట్ ప్రకటించారంటే.. వాటర్ కోతలు అమలు చేస్తున్నట్టే లెక్క.
రెడ్ అలర్ట్ అమల్లో ఉన్నప్పుడు గరిష్టంగా 24 గంటల సేపు నీటి సరఫరా నిలిపోతాయి. నగరంలో 17 లక్షల కస్టమర్లకు నీటిని గరిష్టంగా 24 గంటల సేపు ఆపేస్తారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి ఇలా వాటర్ కట్స్‌త నిర్ణయం తీసుకున్నారు.
గడిచిన 30 సంవత్సరాల్లో దేశంలో నీటి లభ్యత 10 శాతం నుంచి 37 శాతం వరకు పడిపోయినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. 2060 కల్లా దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మరో 50 శాతం మేర నీటి లభ్యత పడిపోయే ముప్పు ఉన్నట్టు పేర్కొంది.