టీవీ ఛానల్ లైవ్ లో వాతావరణ నిపుణురాలికి స్ట్రోక్.. షాకింగ్ వీడియో వైరల్

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 3:33 PM IST
Highlights

CBS Los Angeles: అమెరికాలో ఓ మహిళా యాంకర్ లైవ్ ప్రసారం క్ర‌మంలో  స్ట్రోక్  కు గురైన షాకింగ్ వీడియో వైర‌ల్ గా మారింది. లైవ్ లో  వెదర్ రిపోర్టు చేస్తుండ‌గానే ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
 

Weatherwoman Stroke Video: ఇటీవ‌లి కాలంలో అక‌స్మాత్తుగా స్ట్రోక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా ఇటీవ‌ల అప్ప‌టివ‌ర‌కు బాగానే ఉండి ఒక్క‌సారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ప‌రిస్థితులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఒక టీవీ ఛానెల్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుండ‌గా వాతావరణ నిపుణురాలికి స్ట్రోక్ గురై కింద‌ప‌డిపోయారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

 

🚨: As terrifying moment happened when a CBS LA meteorologist collapsed live on air

📌 |

Terrifying moment shows when a CBS LA meteorologist Alissa Carlson Schwartz collapsed on-air on Saturday morning while doing a live report her co workers… https://t.co/zkWpaB81yZ pic.twitter.com/tQ9To9spDo

— R A W S A L E R T S (@rawsalerts)

 

అమెరికాలో ఓ మహిళా యాంకర్ లైవ్ ప్రసార సమయంలో గుండెపోటుకు గురైంది. ఆ మహిళ వాతావరణ అప్డేట్స్ ఇస్తుండగా మాట్లాడుతుండగా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. ఈ షో లైవ్ లో వస్తుండటంతో ఈ ఘటనను న్యూస్ ఛానల్ వీక్షకులు కూడా స్పష్టంగా చూశారు. అమెరికాకు చెందిన ఆ 'వెదర్ ఉమెన్' స్ట్రోక్ కు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ దృశ్యాల్లో అక్క‌డ ఏం జ‌రిగింద‌నే స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ వెదర్ వుమన్ పేరు అలిస్సా కార్ల్సన్ ష్వార్ట్జ్, ఆమె సీబీఎస్ న్యూస్ ఛానల్ లో వాతావ‌ర‌ణ వివ‌రాలు వెల్ల‌డిస్తోంది. ఉదయం 7 గంటలకు న్యూస్ ఛానల్ కు రిపోర్టును సమర్పిస్తున్న సమయంలో లైవ్ ప్రసారం సందర్భంగా ఆమెకు స్ట్రోక్ వ‌చ్చింది. ఆ సమయంలో న్యూస్ యాంకర్లు నికెల్ మదీనా, రాచెల్ కిమ్ కూడా ప్రేక్షకులకు సమాచారం ఇస్తున్న‌ట్టు క‌నిపించింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

 

CBS LA meteorologist Alissa Carlson Schwartz stroked out LIVE on-air on Saturday morning during her weather report.

It’s becoming too big to ignore. pic.twitter.com/0RneqbqNYp

— Stew Peters (@realstewpeters)

 

 

click me!