సిగ్గుచేటు.. ఆమోదయోగ్యం కానీ చ‌ర్య‌లు.. భారత హైకమిషన్ భవనం దాడిపై లండ‌న్ మేయ‌ర్ ఆగ్ర‌హం

Published : Mar 20, 2023, 02:45 PM IST
సిగ్గుచేటు.. ఆమోదయోగ్యం కానీ చ‌ర్య‌లు.. భారత హైకమిషన్ భవనం దాడిపై లండ‌న్ మేయ‌ర్ ఆగ్ర‌హం

సారాంశం

London: లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్  భ‌వ‌నంపై ఉన్న భార‌త జాతీయ జెండాను కింద‌కు దింప‌డంపై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్త దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు లండన్ లో చేసిన పనిని భార‌త్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపింది.   

UK Indian High Commission : లండ‌న్ లోని భారత హైకమిషన్ భద్రతను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనీ, వేర్పాటువాద ఖలిస్థాన్ జెండాలు ఎగురవేసిన నిరసనకారుల బృందం చేసిన విధ్వంసం అవమానకరమైనద‌నీ, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భారత హైకమిషన్ పై ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని నిరసనకారులు ఆదివారం ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేస్తూ కింద‌కు దించారు. భ‌వ‌నంపై దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే హింసాత్మక ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి. ఘటనకు సంబంధించి ప‌లువురినిఅరెస్టు చేశారు. విఫలయత్నం చేసిన దాడిని అడ్డుకున్నామ‌నీ, భార‌త త్రివర్ణ పతాకం ఇప్పుడు గొప్పగా ఎగురుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.

 

 

కాగా, ఖ‌లిస్థాని అనుకూల వాదుల‌తో కూడిన గుంపు భార‌త ఎంబ‌సీ వ‌ద్ద జాతీయ జెండాను దించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే వారిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన‌ట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన లండన్ మేయర్ సాధిక్ ఖాన్ హింసాత్మక ఘటనను, విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రవర్తనకు మన నగరంలో చోటు లేదని ట్వీట్ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటని, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని భారత్ లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ పేర్కొన్నారు.

వింబుల్డన్ విదేశాంగ మంత్రి లార్డ్ తారిఖ్ అహ్మద్ మాట్లాడుతూ భారత హైకమిషన్ భద్రతను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. మిషన్, సిబ్బంది సమగ్రతకు వ్యతిరేకంగా ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాని చర్య అని ఆయన ట్వీట్ చేశారు. భార‌త‌ హైకమిషన్ భవనం వద్ద కిటికీలు పగిలిపోయాయని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఖ‌లిస్థానీ అనుకూల వాదుల అక్క‌డకు చేరుకున్నార‌నే స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే అక్క‌డి చేరుకున్నారు. పోలీసులు ఎంట‌రై వారిని చెద‌ర‌గొట్టారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ‌ను ప్రారంభించిన‌ట్టు తెలిపారు. 

ఇదిలావుండగా, తమ దౌత్య కార్యాలయం భద్రతపై బ్రిటీష్ ప్రభుత్వం వద్ద భారత్ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ప్రాంగణంలో తగినంత భద్రత లేకపోవడం గురించి ప్రశ్నించింది. పగిలిన కిటికీలు, ఇండియా హౌస్ భవనంపైకి ఎక్కిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మిషన్ మొదటి అంతస్తు కిటికీ గుండా ఒక భారతీయ అధికారి ఒక నిరసనకారుడి నుంచి జెండాను లాక్కోగా, నిరసనకారుడు దాని అంచుకు వేలాడుతూ ఖలిస్తాన్ జెండాను ఎగురవేస్తూ కనిపించాడు. లండన్ లోని భారత హైకమిషన్ కు వ్యతిరేకంగా వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు తీసుకున్న చర్యలపై భారత్ త‌మ నిర‌స‌న‌ను తెలుప‌డానికి న్యూఢిల్లీలోని సీనియర్ మోస్ట్ యూకే దౌత్యవేత్తను ఆదివారం సాయంత్రం పిలిపించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ ) తెలిపింది.

హైకమిషన్ ఆవరణలోకి ఈ శక్తులను అనుమతించడానికి బ్రిటిష్ భద్రత పూర్తిగా లేకపోవడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వియన్నా కన్వెన్షన్ ప్రకారం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేశారని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. యూకేలోని భారత దౌత్య కార్యాలయాలు, సిబ్బంది భద్రతపై యూకే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..
USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్