Canada లో ఆర్థిక సంక్షోభం: వచ్చే త్రైమాసికంలో లక్షలాది ఉద్యోగాలు పోయే అవకాశాలు

Published : May 27, 2025, 10:11 AM IST
Canada లో ఆర్థిక సంక్షోభం: వచ్చే త్రైమాసికంలో లక్షలాది  ఉద్యోగాలు పోయే అవకాశాలు

సారాంశం

కెనడాలో ఆర్థిక మందగమనం ముదురుతోంది. వచ్చే నెలల్లో లక్ష మందికి పైగా ఉద్యోగాలు కోల్పోనున్న పరిస్థితి నెలకొంది.

కెనడాలో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపార రంగం నుంచి గృహ నిర్మాణ రంగం వరకూ ప్రభావితమవుతున్న ఈ సంక్షోభం, వచ్చే త్రైమాసికంలో లక్ష మందికి పైగా ఉద్యోగాలు పోవచ్చన్న తీవ్ర అంచనాలకు దారితీసింది.

టొరాంటో డొమినియన్ బ్యాంక్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు పీటర్ కరెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం గత రెండు నెలల్లోనే సుమారు 75,000 ఉద్యోగాలు కోల్పోయాయి కెనడియన్ కంపెనీలు. వాటిలో సగం ఉత్పత్తి రంగానికే చెందడం ఆందోళన కలిగిస్తోంది. అదే దిశగా మూడో త్రైమాసికంలో మరో లక్ష ఉద్యోగాలు పోవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం కెనడాలో నిరుద్యోగం 6.2 శాతంగా ఉండగా, ఇది 7.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కరోనా కంటే..

ఈ ఆర్థిక సంక్షోభం పుట్టుకలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన పన్నుల విధానం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ విధానం వల్ల కెనడాలోని వ్యాపారాలు, రియల్టీ రంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరోనా సమయంలో కంటే కూడా పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఆర్థిక నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. వారి అంచనాల ప్రకారం, రెండో త్రైమాసికంలో కెనడా ఆర్థిక వ్యవస్థ 1 శాతం, మూడో త్రైమాసికంలో 0.1 శాతం వృద్ధి బదులు క్షీణతలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య కెనడా ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది.

ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం పర్యావరణపరంగా అనుకూలమైన గృహాల నిర్మాణాన్ని ప్రోత్సహించే దిశగా పన్ను మినహాయింపులు, GST రాయితీలు వంటి ప్రణాళికలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. అయితే ఈ చర్యలకు ప్రారంభ దశలోనే $5 నుంచి $6 బిలియన్ల ఖర్చు అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక గృహ రంగాన్ని గమనిస్తే, కొత్త ఇళ్ల నిర్మాణాలు తగ్గిపోవడం, అమ్మకాల్లో మందగమనం వంటి అంశాలు గత కొంతకాలంగా కనిపిస్తున్నాయి. మూడీస్ అనలిటిక్స్ ప్రకారం, ఈ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి ఇంటి ధరలు కొంత తగ్గినా, అసలు సమస్య పరిష్కారానికి ఇంకా చాలా దూరంగా ఉందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కెనడా ప్రజలు రాబోయే నెలల్లో మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండగా, ప్రభుత్వ చర్యలు ఎంత వరకు ఉపశమనం కలిగిస్తాయో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే