టెక్సాస్ లోని హిందూ ఆలయంలో చోరీ.. హుండీ, లాకర్ ఎత్తుకెళ్లిన దొంగలు

By team teluguFirst Published Jan 21, 2023, 10:45 AM IST
Highlights

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక శ్రీ ఓంకారనాథ్ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఆలయంలోకి దొంగలు ప్రవేశించి లాకర్, హుండీలను ఎత్తుకొని వెళ్లారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయంలో చోరీ జరిగింది. జనవరి 11వ తేదీన ఈ దొంగతనం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌ రాష్ట్రంలోని బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం అయిన  శ్రీ ఓంకారనాథ్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చోరికి సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

అగ్రవర్ణాల పార్టీ కాబట్టే కుల గణన అంటే బీజేపీకి భయం.. ఎన్నిక‌ల ముందే కుల గ‌ణ‌న చేయాలి : ప్ర‌తిప‌క్షాల డిమాండ్

ఈ ఘటనపై బ్రజోస్ వ్యాలీ శ్రీ ఓంకారనాథ్ ఆలయ బోర్డు సభ్యుడు శ్రీనివాస సుంకరి మాట్లాడుతూ.. దుండగులు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించారని తెలిపారు. తరువాత ఆలయానికి వచ్చి విరాళాలు, విలువైన వస్తువులు ఉంచే లాకర్ ను ఎత్తుకెళ్లారని చెప్పారు. గుడి వెనుక ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివసించే పూజారి, అతడి కుటుంబం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ‘‘ మాకు ఇలాంటివి జరిగినప్పుడు దండయాత్ర జరిగినట్టుగా అనిపిస్తుంది. గోప్యత కోల్పోయిన భావన ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Indian community was left in a state of shock after burglars broke into a Hindu temple in the state of and stole its donation box, the media reported. pic.twitter.com/CL1EEdKXbe

— IANS (@ians_india)

‘‘మేము భవిష్యతుల్లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మా ప్రార్థనా స్థలం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటాం. మా పూజారి, ఆయన కుటుంబం ఉంది. మేము పుంజుకుంటాం’’ అని తెలిపారు. చోరీపై దర్యాప్తు చేస్తున్నామని బ్రజోస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

click me!