పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాదులు.. రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు..

By Rajesh KarampooriFirst Published Jan 21, 2023, 6:20 AM IST
Highlights

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో  8 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారందరినీ ప్రస్తుతం చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి రైలులోని ఆరు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పాయి. దాదాపు ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి ముహమ్మద్ కాషిఫ్ ప్రకారం.. పెషావర్‌కు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ పనీర్ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైలులోని ఆరు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

అలాగే.. రెస్క్యూ టీమ్‌లను సంఘటనా స్థలానికి పంపించి, దెబ్బతిన్న ట్రాక్‌ను మరమ్మతులు చేశామని, గాయపడిన వారిని కూడా చికిత్స కోసం ఆసుపత్రికి పంపినట్లు ఆయన చెప్పారు. రిమోట్ కంట్రోల్ పరికరం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనను ధృవీకరిస్తూ డిప్యూటీ కమిషనర్ కచ్ అఘా సమీవుల్లా మాట్లాడుతూ.. రైలులోని పలు బోగీలు పట్టాలు తప్పిన రిమోట్ కంట్రోల్ పేలుడు ఇది అని తెలిపారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు, తీవ్రవాదులు అనేక దాడులకు పాల్పడటంతో గత నెల నుండి తీవ్రవాద సంఘటనలు పెరిగాయి. డిసెంబర్‌లో భద్రతా సిబ్బందిపై దాడులు జరిగాయి.  ఈ దాడిలో కెప్టెన్‌తో సహా ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు అదే సమయంలో 17 మంది గాయపడ్డారు.
అలాగే.. బుధవారం నాడు ఇరాన్‌తో సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు పాకిస్తాన్ భద్రతా దళాల కాన్వాయ్‌పై కాల్పులు జరపడంతో ఐదుగురు సైనికులు మరణించారు.

పెరిగిన ఉగ్రవాదులు 

ఇస్లామాబాద్‌కు చెందిన థింక్-ట్యాంక్ పాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (PIPS) ప్రకారం.. 2022లో 262 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు. వివిధ జాతీయవాద తిరుగుబాటుదారులు, మతపరమైన ప్రేరేపిత తీవ్రవాదులు, హింసాత్మక సెక్టారియన్ గ్రూపులు పాకిస్తాన్‌లో మొత్తం 262 తీవ్రవాద దాడులను నిర్వహించాయి. ఇందులో 14 ఆత్మాహుతి బాంబు దాడులు ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27 శాతం ఉగ్రవాదులు పెరిగాయని PIPS తన వార్షిక నివేదికలో పేర్కొంది.

అలాగే..ఈ ఉగ్రవాద దాడుల్లో మొత్తం 419 మంది మరణించారు, ఇది 2021లో జరిగిన మరణాల కంటే 25 శాతం ఎక్కువ" అని నివేదిక పేర్కొంది. ఇది కాకుండా, ఇందులో సుమారు 734 మంది గాయపడినట్లు కూడా నివేదికలో చెప్పబడింది. 2022లో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా మరణించిన వారిలో దాదాపు సగం మంది భద్రతా బలగాలు, చట్ట అమలు సంస్థల సిబ్బందేనని తెలుస్తుంది. 

click me!