Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు..27 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Dec 11, 2021, 2:44 PM IST
Highlights

Lebanon Explosion: పశ్చిమ ఆసియా దేశ‌మైన లెబ‌న‌న్ లో భారీ పెలుడు సంభ‌వించింది.  లెబనీస్ ఓడరేవు నగరం టైర్‌లోని పాలస్తీనా శిబిరంలో సంభవించిన ఈ పేలుడులో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.  డ‌జ‌న్ల మంది  గాయ‌ప‌డ్డారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. 
 

Lebanon Explosion: పశ్చిమ ఆసియా దేశ‌మైన  లెబనాన్ లో భారీ పేలుడు చోటుచేసుకంది. ఈ ఘ‌ట‌న‌లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.  డ‌జ‌న్ల మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో 12 మందికి తీవ్ర గాయ‌లయ్యాయి. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. లెబ‌న‌న్ మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దక్షిణ లెబనీస్ ఓడరేవు నగరం టైర్‌లోని  పాలస్తీనా శిబిరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 27మంది వరకు చనిపోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డ‌రు. లెబనాన్‌లోని శరణార్థి శిబిరంలో పాలస్తీనా హమాస్ గ్రూపు కోసం నిల్వ ఉంచిన ఆయుధాలు పేలాయి. అక్క‌డి స్థానిక మీడియా ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే 13 మంది చ‌నిపోయార‌ని  పేర్కొంది. అలాగే, 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని వెల్ల‌డించింది. అయితే, ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. మొత్తం 27 మంది చ‌నిపోయారు. వారిలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంది.

Also Read: ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

బుర్జ్ అల్-షెమాలి క్యాంప్‌లోని అనుమానిత హమాస్ ఆయుధ డిపోలో పేలుడు జరిగింద‌నీ,  దర్యాప్తు ప్రారంభించాలని న్యాయమూర్తి భద్రతా బలగాలను ఆదేశించారని లెబ‌న‌న్  ప్రభుత్వ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో  నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లను మండించడం వల్ల పేలుడు సంభవించిందని షెహబ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలావుండ‌గా, లెబ‌న‌న్ లో వేల మంది పాల‌స్తీనా శ‌ర‌ణార్థులు ఉన్నారు. మొత్తం 12 శరణార్థి శిబిరాల్లో 10వేల మంది పాలస్తీనా శరణార్థులు ఉన్నట్టు స‌మాచారం. అయితే, హమాస్, ఫతాతో సహా అనేక పాలస్తీనియన్ గ్రూపులు దక్షిణ లెబనాన్‌లో పాలస్తీనా శిబిరాలను నియంత్రిస్తాయి. ఆయా ప్రాంతాల్లో కి లెబనీస్ అధికారులు పెద్ద‌గా వెళ్ల‌ర‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  ఇక ప్ర‌స్తుతం పెలుడు జ‌రిగిన పాల‌స్తీనా శిబిరంలో హామాస్ భారీగా ఆయుధాలు ఉంచుతుంద‌ని తెలిపాయి. లెబ‌న‌న్ లో ఉన్న పాల‌స్తీనియ‌న్ శిబిరాల్లో పెలుడు జ‌రిగిన‌ది అతి పెద్ద శిబిరమ‌ని డీడ‌బ్ల్యూ పేర్కొంది.  పేలుడుపై  లెబనీస్ భద్రతా అధికారి మాట్లాడుతూ..ఈ ఘటనలో మరణించినవారు 12మంది అని కానీ కచ్చితమైన సమాధానం అయితే లేదని పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశముందన్నారు. 

Also Read: Covid-19 impact: స్కూళ్ల మూత.. 32 కోట్ల మంది చిన్నారుల‌పై ప్ర‌భావం !

ఇదిలావుండ‌గా, లెబ‌న‌న్ ప్ర‌స్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అవినీతి కార‌ణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి లెబ‌న‌న్ జారుకుంది. లెబ‌న‌న్ లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డి క్రైసిస్ ను నివారించ‌డానికి ఇటీవ‌లే ఫ్రాన్స్, దుబాయ్ దేశాలు ప్ర‌త్యేక స‌మావేశ‌మై.. లెబ‌న‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఈ రెండు దేశాలు ప్ర‌క‌టించాయి.  లెబ‌న‌న్ రాజ‌కీయ‌, ఆర్థిక సంక్షోభాన్ని ప‌రిష్క‌రించ‌డం కోసం అంత‌ర్జాతీయంగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. కానీ అవేవీ ఫ‌లించ‌డం లేదు. గ‌త వారం ఈ రెండు దేశాలు ముందుకు సాగుతూ.. చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆశ‌ల‌ను పెంచుతోంది. 

Also Read: Bank privatisation: కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల సంచలన నిర్ణయం

click me!