చార్జర్‌లు లేకుండా ఐఫోన్లు అమ్ముతున్నారని.. యాపిల్ కంపెనీపై 20 మిలియన్ డాలర్ల జరిమానా.. ఏ దేశమంటే?

By Mahesh KFirst Published Oct 14, 2022, 2:42 PM IST
Highlights

చార్జర్లు లేకుండా ఐఫోన్లు అమ్మడంపై యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు తప్పుపట్టింది. గత రెండేళ్లలో చార్జర్లు లేకుండా ఐఫోన్లు కొనుగోలు చేసిన బ్రెజిల్ వినియోగదారులందరికీ వాటిని సప్లై చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ కంపెనీపై 20 మిలియన్ డాలర్ల ఫైన్ వేసింది.
 

న్యూఢిల్లీ: చార్జర్లు లేకుండా ఐఫోన్లు అమ్ముతున్నారని, ఆ తర్వాత కస్టమర్లు తప్పనిసరై చార్జర్లు కొనుక్కునేలా యాపిల్ సంస్థ బలవంతపెడుతున్నదని బ్రెజిల్ కోర్టు పేర్కొంది. చార్జర్లు లేకుండా ఐఫోన్‌లను అమ్మడంపై అభ్యంతరం తెలిపింది. యాపిల్ సంస్థపై 20 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేసే అవకాశం ఉన్నది.

సెప్టెంబర్ నెలలో ఇదే విషయమై బ్రెజిల్ జస్టిస్ మినిస్ట్రీ యాపిల్ పై సుమారు 2.5 మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. చార్జర్లు లేకుండా ఐఫోన్ 12, ఐఫోన్ 13 మాడళ్లు బ్రెజిల్‌లో అమ్మకుండా నిషేధం విధించింది. తాజాగా, సావోపావోలోలోని ఓ కోర్టు జరిమానా విధించింది. బ్రెజిలియన్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన లాసూట్ విచారించి కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Also Read: ఫ్లిప్ కార్ట్ చేసిన తప్పుకు ఎగిరి గంతేసిన కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే.. వచ్చింది చూసి.....

2020 అక్టోబర్‌లో కొత్త ఐఫోన్‌లకు చార్జర్లు కలిపి అమ్మడాన్ని నిషేధించింది. తద్వారా ఎలక్ట్రానిక్ వేస్టును తగ్గించినట్టు అవుతుందని యాపిల్ తెలిపింది. కానీ, ఆ ఫోన్ నడవడానికి అదే సంస్థకు చెందిన మరో పరికరాన్ని కొనుగోలు చేయాల్సి వస్తున్నదని న్యాయమూర్తి కారమురు అఫోన్సో ఫ్రాన్సిస్కో తన తీర్పులో పేర్కొన్నారు.

గత రెండేళ్లలో బ్రెజిల్‌లో ఐఫోన్ 12, 13 మాడల్స్ కొనుగోలు చేసిన వారందరికీ చార్జర్లు సప్లై చేయాలని కంపెనీకి కోర్టు ఆదేవించింది. ఇక పై అమ్మే ఐఫోన్‌లకు చార్జర్లను కలిపే ఇవ్వాలని తెలిపింది.

click me!