వైరల్ : మహిళ కంట్లో 23కాంటాక్ట్ లెన్సులు... పెట్టడమేకానీ తీయడం మర్చిపోయి...!

Published : Oct 14, 2022, 01:04 PM IST
వైరల్ :  మహిళ కంట్లో 23కాంటాక్ట్ లెన్సులు... పెట్టడమేకానీ తీయడం మర్చిపోయి...!

సారాంశం

 అలా ఆమె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంది. అవి పేరుకుపోయి.. ఆమెకు ఇబ్బందిగా మారడంతో...వైద్యులను ఆశ్రయించింది

కంటి చూపు సరిగాలేక ఇబ్బంది పడుతున్నవారు మనలో చాలామందే ఉంటారు. ఐ సైట్ తో ఉన్నవారు.. కంటాక్ట్ లెన్సులు వాడటం కూడా చాలా సహజమైన విషయం. అయితే... ఆ కాంటాక్ట్ లెన్స్ ని తరచూ పెట్టుకుంటూ.. తీస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ.... తన కంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంది కానీ... వాటిని తొలగించడం మర్చిపోయింది. అలా ఆమె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంది. అవి పేరుకుపోయి.. ఆమెకు ఇబ్బందిగా మారడంతో...వైద్యులను ఆశ్రయించింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

కాలిఫోర్నియాకు చెందిన ఓ వైద్యురాలు ఈ వీడియోని షేర్ చేయడం గమనార్హం. ఆ వీడియోలో ఓ డాక్టర్.. మహిళ కంట్లోని కాంటాక్ట్ లెన్స్ ని తొలగించడం గమనార్హం. దాదాపు ఆమె కంట్లో నుంచి 23 కాంటాక్ట్ లెన్స్ ని తొలగించారు. డాక్టర్ కేథరీనా కుర్తీవా తన సోషల్ మీడియాలో గత నెల షేర్ చేశారు.

సదరు మహిళ... ప్రతిరోజూ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేది. కానీ.... రాత్రిపూట మాత్రం వాటిని తొలగించడం మర్చిపోయేది. మళ్లీ ఉదయాన్నే వాటిని పెట్టుకునేది.  ఇలా 23 పెట్టుకుంది. కాగా... వైద్యులు వాటిని పూర్తిగా తొలగించారు. ఇలా చేయడం ప్రమాదమని.. రాత్రిపూట మర్చిపోకుండా కాంటాక్ట్ లెన్స్ తొలించాలని వైద్యులు ఈ సందర్భంగా చెప్పారు.  ఇప్పటికే 29లక్షల వ్యూస్​, 81వేల లైక్స్​ ఈ వీడియోకు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటివారు లెన్స్ కి బదులు కళ్లజోడు పెట్టుకోవడం మంచిదని కామెంట్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?