బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన వయస్సు 55 ఏళ్లు. బోరిస్ భార్య క్యారీ సైమండ్స్ బుధవారం నాడు లండన్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్ దంపతులు కూడ ధృవీకరించారు
లండన్:బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన వయస్సు 55 ఏళ్లు. బోరిస్ భార్య క్యారీ సైమండ్స్ బుధవారం నాడు లండన్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్ దంపతులు కూడ ధృవీకరించారు.
అధికార కన్జర్వేటివ్ పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ గా పనిచేసిన క్యారీ సైమండ్స్ తో బోరిస్ కొన్ని రోజులుగా సైమండ్స్ డేటింగ్ లో ఉన్నారు. సైమండ్ వయస్సు 32 ఏళ్లు.2019లో వీరిద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని బట్టబయలు చేశారు. త్వరలోనే పెళ్లి చేసుకొంటామని ఆ దంపతులు ప్రకటించారు.
undefined
కరోనా వైరస్ సోకి నయమై ఆసుపత్రి నుండి బోరిస్ జాన్సన్ ఇటీవలననే డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఆయన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది.
బుధవారం నాడు ఉదయం లండన్ లో ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా అధికార వర్గాలు ప్రకటించారు. తల్లి, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రకటించారు.
అలెగ్రా మెస్టిన్ అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు జాన్సన్. 1993 నుండి ఆయన విడిపోయాడు. ఆ తర్వాత మెరీనా వీలర్ ను వివాహమాడాడు. 2019 నుండి సైమండ్స్ తో సన్నిహితంగా ఉన్నాడు.