న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్‌లో ప్రయాణీకులపై తూటాల వర్షం, భారీగా మృతులు

Siva Kodati |  
Published : Apr 12, 2022, 08:08 PM ISTUpdated : Apr 12, 2022, 09:25 PM IST
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్‌లో ప్రయాణీకులపై తూటాల వర్షం, భారీగా మృతులు

సారాంశం

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని సబ్ వే స్టేషన్‌ మంగళవారం తుపాకీ కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. గుర్తు తెలియని దుండగుడు ప్రయాణీకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భారీగా మరణాలు చోటు చేసుకుని వుండొచ్చని తెలుస్తోంది. 

అమెరికాలో (america) మరోసారి తుపాకీ గర్జించింది. దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని  (new york) బ్రూక్లిన్‌లో (brooklyn) 36వ స్ట్రీట్‌ సబ్‌వే (sub way station) స్టేషన్‌లో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో (shooting) పలువురు మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. మీడియాకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. దీనికి సంబంధించి నెత్తురోడుతున్న గాయాలతో బాధితులు స్టేషన్‌లోనే ప్లాట్‌ఫాంపై పడి ఉన్నట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

ఉదయం స్టేషన్‌లో రద్దీగా వున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు అలాంటివి ఆధారాలు లభ్యం కాలేదని న్యూయార్క్‌ పోలీస్ విభాగం చెప్పింది. బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్‌, 4వ అవెన్యూ ప్రాంతంలోకి వెళ్లొద్దని పౌరులకు సూచనలు జారీ చేశారు.  కాల్పుల నేపథ్యంలో సబ్‌వేలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. దుండగుడు మాస్క్ వేసుకుని ప్రయాణీకులపై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సబ్ వే నుంచి భారీ పొగలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఇది ఉన్మాది పనా.. లేక ఉగ్రదాదుల పనా అన్నది తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే