
Pakistan: ఇటీవల పాకిస్తాన్‌లో రాజకీయ గందరగోళం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఓటమి పాలైంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు నూతన ప్రధాని అభ్యర్థిగా.. షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణం చేశారు. అనంతరం.. జాతీయ అసెంబ్లీ పిలుపునివ్వగా.. అసెంబ్లీ సమావేశమైంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు.
ఈ సందర్భంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఎంఎన్ఎ ఫహీమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్.. 'అంతర్జాతీయ భికారీ' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన సెల్ఫీ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో చేయడంతో వైరల్‌గా మారింది. (బిచ్చగాడు). ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించినప్పుడు, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ దేశం యొక్క తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం చూపుతున్నప్పుడు స్వీయ-రికార్డ్ వీడియో నేషనల్ అసెంబ్లీలో బంధించబడింది.