సిరియాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 23 మందికి గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
సిరియాలోని డమాస్కస్ సమీపంలోని షియా ముస్లిం ప్రార్థనా మందిరంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. అయితే సయిదా జీనాబ్ పరిసరాల్లో జరిగిన ఈ పేలుడులో 26 మంది గాయపడ్డారని ప్రభుత్వ వార్తా సంస్థ ‘అల్ ఇఖ్బరియా టీవీ’ తెలిపింది. మరో 20 మంది అక్కడికక్కడే చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. అయితే మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని, ఆమె ముగ్గురు పిల్లలు గాయపడ్డారని బ్రిటన్ కు చెందిన ప్రతిపక్ష వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.
భార్యను హతమార్చి.. రెండేళ్ల కూతురును రైలు పట్టాలపై పడుకోబెట్టి.. దారుణం
సిరియా అంతర్యుద్ధంలో రష్యాతో పాటు సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ కు కీలక మిత్రదేశంగా ఉన్న ఇరాన్ మిలీషియా స్థావరాలకు సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు అబ్జర్వేటరీ పేర్కొంది. అయితే అల్-ఇఖ్బరియా, ఇతర ప్రభుత్వ అనుకూల మీడియా షేర్ చేసిన ఫొటోలలో కాలిపోయిన టాక్సీ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నారు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు జెండాలు, బ్యానర్లు ఆ ప్రాంతంలోని భవనాలపై వేలాడుతూ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ప్రజలు సహాయం కోసం ఆర్థనాదాలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమీపంలోని దుకాణాల అద్దాలు పగిలిపోగా.. మరొకటి అగ్నికి ఆహుతైంది.
ముహమ్మద్ ప్రవక్త మనుమరాలు సయీదా జీనాబ్ పుణ్యక్షేత్రానికి ఈ పేరు పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు నుంచి మతపరమైన అంతర్యుద్ధంగా మారిన ఈ సంఘర్షణ తొలినాళ్లలో అసద్ కు మద్దతుగా నిలిచిన షియా పోరాట యోధులకు ఈ మందిరాన్ని పరిరక్షించడం ఒక నినాదంగా మారింది. ఇస్లామిక్ మాసం మొహర్రం 10 వ రోజున ఈ ఘటన జరిగింది.