వాతావరణ మార్పులపై ఐరాస చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

Published : Jul 28, 2023, 01:00 AM IST
వాతావరణ మార్పులపై ఐరాస చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రాస్ వాతావరణ మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జులై లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన సగటు ఉష్ణోగ్రతలు చూస్తే ఈ భూగోళం అధిక వేడిమితో ఉడికిపోయే కాలం వచ్చినట్టు అనిపిస్తోందని అన్నారు. 

గత కొన్ని దశాబ్దాలుగా భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలా భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం.. ప్రజలకు ఒకరకంగా ప్రమాదమే. ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జూలైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న చెప్పారు. భూమి వేడెక్కుతున్న దశ నుండి గ్లోబల్ బాయిలింగ్ యుగంలోకి అడుగుపెట్టబోతున్నమని తెలిపారు. 

సెక్రటరీ జనరల్ న్యూయార్క్‌లో మాట్లాడుతూ..  ఉత్తర అర్ధగోళంలో విపరీతంగా పెరిగిపోయిందని, తద్వారా ఈ వేసవి ప్రజల పట్ల భయానకంగా మారిందని వివరించారు.మొత్తం గ్రహానికి ఇదోక విపత్తు అనీ, వాతావరణ మార్పు విపత్తు, ఇది ప్రారంభం మాత్రమేననీ, భూమండలం వేడెక్కడం ముగిసింది... ఇప్పుడు ఆ వేడితో భూమండలం ఉడికిపోవడం మొదలైంది. ఈ గణనీయమైన మార్పు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. అంచనాలు, పదేపదే చేసిన హెచ్చరికలు ఏవీ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో