అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 180 మంది రోహింగ్యా శరణార్థులు గల్లంతు..

By team teluguFirst Published Dec 27, 2022, 1:09 PM IST
Highlights

బంగ్లాదేశ్ కాక్స్ బజార్‌ నుంచి 180 మంది రోహింగ్యా శరణార్థులను తీసుకొని మలేషియాకు బయలుదేరిన ఓ పడవ బోల్తా పడినట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. అందులో ఉన్నవారి ఆచూకీ తెలియడం లేదని పేర్కొంది. 

180 మంది రోహింగ్యా శరణార్థులను మలేషియాకు తీసుకెళ్తున్న పడవ అండమాన్ సముద్రంలో కనిపించకుండా పోయింది. అయితే అందులో ఉన్న శరణార్థులందరూ గల్లంతు అయ్యారని ఐక్యరాజ్యసమితి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పడవ బంగ్లాదేశ్ నగరంలోని కాక్స్ బజార్‌లోని శిబిరాల నుంచి డిసెంబర్ 2న మలేషియాకు బయలుదేరి వెళ్లిందని తెలిపింది. అందులో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అఖిలేశ్ యాదవ్, మాయావతి డుమ్మా! కీలక యూపీలో కాంగ్రెస్ ఆశలు గల్లంతు?

డిసెంబరు 8వ తేదీన ఈ పడవలో ఉన్న వారితో సంబంధాలు తెగిపోయాయని, వారు ఇంకా బతికే ఉన్నారనే ఆశ చాలా తక్కువగా ఉందని వారి బంధువులు తెలిపినట్టు ‘గార్డియన్’నివేదించింది. కాక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థి అయిన మహ్మద్ నోమన్, మలేషియాలో ఉన్న తన భర్తను కలవాలనే ఉద్దేశంతో ఆమె సోదరి, ఇద్దరు కుమర్తెలతో కలిసి అయితే వారితో డిసెంబర్ 8వ తేదీన సంబంధాలు కోల్పోయినట్టు ఆమె భర్త పేర్కొన్నారు. 

కాగా.. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం పడవ నిజంగానే మునిగిపోయినట్లయితే ఈ 2022 సంవత్సరం బంగ్లాదేశ్‌లోని శరణార్థులు శిబిరాల నుండి పారిపోవడానికి అత్యంత ఘోరమైన సంవత్సరాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. దీంతో ఈ ఏడాది మరణించిన మొత్తం శరణార్థుల సంఖ్య 350కి చేరుకుంటుంది. ఇటీవలీ సంవత్సరాల్లో ఇంత ఘోరమైన ప్రమాదం జరగలేదు.

చివరి రోజు ట్విస్ట్.. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా రేఖా గుప్తాను ప్రకటించిన బీజేపీ..

దాదాపు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది రోహింగ్యా ముస్లింలు ఇప్పుడు కాక్స్ బజార్ శిబిరాల్లో నివసిస్తున్నారు, బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో హింస చెలరేగడంతో వారంతా అక్కడికి వలస వచ్చారు. అయితే వీరందరూ విద్యకు, జీవనోపాధికి దూరమయ్యారు. జైలు లాంటి పరిస్థితులలో జీవిస్తున్నారు. దీంతో రోహింగ్యాలకు మలేషియా ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. దీంతో వీరంతా సముద్రమార్గం ద్వారా పడవల్లో మలేషియాకు తరలివెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదాలకు గురువుతున్నారు. 

కొంత మంది న్యాయమూర్తుల లోపభూయిష్టత వల్లే న్యాయం ఆలస్యమవుతోంది - కిరణ్ రిజిజు

నవంబర్‌లో మలేషియా మార్గంలో మొత్తం 229 మంది రోహింగ్యాలతో కూడిన రెండు పడవలు అచే ప్రావిన్స్‌ కు చేరుకున్నట్టు యూఎన్ శరణార్థి ఏజెన్సీ తెలిపింది. కాగా.. మయన్మార్ లో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ గత వారం దక్షిణ, ఆగ్నేయ ఆసియాలోని ప్రభుత్వాలకు ఓ సూచన చేశారు. రోహింగ్యా శరణార్థి పడవ ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్..

‘‘ప్రపంచంలోని చాలా మంది సెలవుల సీజన్ ను ఎంజాయ్ చేయడానికి, కొత్త ఏడాదిని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఈ సమయంలో నిరాశతో ఉన్న రోహింగ్యా పురుషులు, మహిళలు, చిన్న పిల్లలతో కూడిన పడవలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదకరమైన ప్రయాణాలకు బయలుదేరుతున్నాయి.’’ అని ఆండ్రూస్ చెప్పారు.

click me!