New Delhi: చైనాలో గతంలో కంటే కరోనా కేసులు పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మాదిరిగానే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Covid-19 New Variant: కరోనా వైరస్ మళ్లీ కల్లోలం రేపుతోంది. చైనా సహా పలు దేశాల్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాల్లో పంజా విసురుతున్న కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని విజృంభిస్తోంది. చైనాలో గతంలో కంటే కరోనా కేసులు పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మాదిరిగానే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
చైనాలో కరోనా వైరస్ మరోసారి ప్రజల జీవితాలను నాశనం చేసింది. రోజూ లక్షల్లో కొత్త కేసులు వస్తున్నాయి. చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల ప్రకారం, ప్రపంచంలో కోవిడ్-19 కొత్త రూపాంతరం కనిపిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తలకు దీని గురించి పూర్తిగా తెలియకపోయినా, ఇది జరగవచ్చని వారు భావిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌ను పోలి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇదివరకు కరోనా మహమ్మారి కేసులు కొత్త రికార్డులను నమోదుచేస్తూ కేసులు పెరిగిన సమయంలో దీనికి ప్రధాన కారణం కొత్త వేరియంట్లుగా ఇదివరకు పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు కూడా చైనాలో మొదలైన కోవిడ్-19 ఉద్ధృతికి కొత్త వేరియంట్లు పుట్టుకురావడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయాలను పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తాజా కోవిడ్-19 ఉద్ధృతి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తీరుపై వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
undefined
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీకి చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ స్టువర్ట్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ చైనా జనాభా చాలా ఎక్కువగా ఉందనీ, దాని రోగనిరోధక శక్తి పరిమితంగా ఉందని చెప్పారు. ఇప్పుడు మరో కరోనావైరస్ కొత్త ఇన్‌ఫెక్షన్‌ని చూడవచ్చని అనిపిస్తున్నదని తెలిపారు. ఇదివరకు అతిపెద్ద కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వేవ్ లను చూశాము.. ఆ సమయంలో తరచుగా కొత్త వేరియంట్లు ఉత్పన్నమవుతాయని ఇదివరకు నమోదైన పరిస్థితులను పేర్కొన్నారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ అసలు ఇన్‌ఫెక్షన్ చైనా నుండి మిగతా ప్రపంచానికి వ్యాపించి, చివరికి డెల్టా వేరియంట్‌తో కోవిడ్-19 కల్లోలం రేపింది. ఆ తర్వాత ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్లతో ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించింది. ఇప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్లు విజృంభిస్తూ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఓహియో స్టేట్ యూనివర్శిటీలో వైరస్ లపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ షాన్-లూ లియూ మాట్లాడుతూ, చైనాలో అనేక ప్రస్తుత ఓమిక్రాన్ వైవిధ్యాలు కనుగొనబడ్డాయని తెలిపారు. ఇందులో BF.7 వ్యాప్తి అధికంగా ఉందనీ, ఇది వ్యాక్సిన్ నుంచి సైతం తప్పించుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ వేరియంట్ ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ వైరస్‌పై మొదట్లో చైనా నుంచి ప్రపంచానికి వ్యాపించిందనీ, ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తుందా లేక భిన్నంగా ఉంటుందా అనేది చూడాల్సి ఉందని భారత్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ లో వైరస్ లపై అధ్యయనం చేసిన డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. దీని సీరియస్‌నెస్ చూసి వ్యాక్సిన్ తయారైందనీ, అయితే, ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడాలని పేర్కొన్నారు. మరోసారి చైనానే కరోనా కల్లోలానికి కేంద్రంగా ఉంటుందా? లేదా మరోప్రాంతం నుంచి కోవిడ్-19 ఉప్పెన మొదలవుతుందా? అనే చూడాలని అన్నారు.