
కీవ్ : ukraineపై russia దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం మరోసారి రెండు దేశాల మధ్య Istanbul వేదికగా peace negotiations జరగనున్నాయి. కాగా, గత రెండు వారాలుగా జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి గమనించి కనిపించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా అంతకు ముందు శాంతి చర్చల్లో పాల్గొన్న సభ్యులపై విషప్రయోగం జరిగనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్, బిల్లింగ్ క్యాట్ తన నివేదికలో పేర్కొన్నాయి.
రెండు దేశాల మధ్య చర్చల్లో పాల్గొన్న రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రెయిన్ కు చెందిన సంధాన కర్తలపై విషప్రయోగం జరిగినట్టు పేర్కొంది. ఈ క్రమంలో అబ్రమోవిచ్, ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు సీనియర్ సభ్యులు ప్రభావితమయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో తెలిపింది. రష్యా బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్, ఉక్రెయిన్ శాంతి సంధానకర్తల మధ్య ఉక్రెయిన్లోని కీవ్ లో జరిగిన సమావేశం తర్వాత అనుమానాస్పద విషపు లక్షణాలను ఎదుర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్, పరిశోధనాత్మక అవుట్లెట్ బిల్లింగ్ క్యాట్ సోమవారం ఒక నివేదికలో పేర్కొన్నాయి.
వారి నివేదిక ప్రకారం.. విష ప్రయోగం జరిగిన అనంతరం అబ్రమోవిచ్, సంధానకర్తల చర్మంపై దద్దుర్లు రావడం, కళ్లు ఎర్రబడటం, స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వారు కోలుకున్నారని, వారి ఆరోగ్యం మెరుగుపడిందని నివేదిక వెలువరించింది. ఈ ఘటనపై నెదర్లాండ్స్కు చెందిన బిల్లింగ్ క్యాట్ పరిశోధనా సంస్థ.. వారిపై chemical weaponతో విషప్రయోగం జరిగినట్లు పేర్కొంది.
అయితే, తక్కువ డోసేజ్ లో ఈ ప్రయోగం జరగడంతో ప్రమాదం ఏమీ జరగలేదని తెలిపింది. అలాగే, కేవలం వారిని బెదిరించి ఎందుకే ఇలా విషప్రయోగం జరిగినట్లు స్పష్టం చేసింది ఇదిలా ఉండగా ఈ నివేదికపై ఇప్పటివరకు రష్యా స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ నివేదికను ఉక్రెయిన్ కు చెందిన శాంతి చర్చలకు కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధ్రువీకరించిన సమాచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని కోరారు.