అప్పుడే పుట్టిన శిశువుకు 12 సెం.మీ తోక.. ఆశ్చర్యపోయిన డాక్టర్స్..

Published : Nov 07, 2021, 10:27 AM IST
అప్పుడే పుట్టిన శిశువుకు 12 సెం.మీ తోక.. ఆశ్చర్యపోయిన డాక్టర్స్..

సారాంశం

అప్పుడే జన్మించిన శిశువుకు తోక ఉండటం (baby boy was born with tail)  చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆ తోక పొడవు 12 సెం.మీ ఉంది. దీనిని డాక్టర్లు.. నిజమైన మానవ తోక (true human tail) అని పేర్కొన్నారు. 

కొన్ని ఘటనలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యమేస్తుంది. తాజాగా ఇలాంటి అనుభవమే బ్రెజిల్‌ (Brazil) డాకర్లకు ఎదురైంది. అప్పుడే జన్మించిన శిశువుకు తోక ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ తోక పొడవు 12 సెం.మీ ఉంది. దీనిని డాక్టర్లు.. నిజమైన మానవ తోక (true human tail) అని పేర్కొన్నారు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన మహిళకు గర్బం దాల్చిన 35 వారాలకు పురిటినొప్పులు వచ్చాయి.

దీంతో ఆమె అల్బర్ట్ సాబీన్ పిల్లల ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించారు. మహిళ మగ శిశువుకు జన్మనివ్వగా.. ఆ బాలుడికి తోక ఉండటం చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. శిశువుకు 12 సెం.మీ తోక, చివరలో 4 సెంటీమీటర్ల వ్యాసార్ధంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది. ఈ క్రమంలోనే వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని.. కేవలం తోక, బంతి పొడుచుకువచ్చినట్టుగా గుర్తించారు.

Alos read: ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. హత్యాయత్నంగా పేర్కొన్న మిలటరీ..

ఇక, అలాగే  చర్మానికి మాత్రమే తోక పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని డాక్టర్స్ గుర్తించారు. అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారణకు వచ్చారు. అనంతరం శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినట్లు వెల్లడించారు. అయితే తోక, బంతిని ఎలా తొలగించారు అనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను వైద్యులు బయటకు వెల్లడించలేదు.

Also read: ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం

అయితే తోకతో పుట్టిన శిశువుకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. అది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ కేసు (Journal of Pediatric Surgery Case) రిపోర్ట్స్‌లో ప్రచురించబడింది. వైద్యులు విడుదల చేసిన ఫొటోలలో శిశువుకు పొడవాటి తోక, దాని చివర బంతి ఉన్నాయి. అయితే ప్రస్తుతం బాలుడికి ఎటువంటి ఆరోగ్య సమస్యల లేవని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !