ఓటమి అంగీకరించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.. నూతన ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్

By Mahesh KFirst Published May 21, 2022, 8:17 PM IST
Highlights

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిగా  వెలువడకముందే శనివారం ప్రధాని స్కాట్ మారిసన్ ఓటమి అంగీకరించాడు. నూతన ప్రధానిగా వచ్చే ఆంటోనీ ఆల్బనీస్‌కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా 2022 ఫెడరల్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ... స్కాట్ మారిసన్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఓడించింది. ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ శనివారం ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ఓటమి అంగీకరించాడు. తద్వార తదుపరి ప్రధానిగతా లేబర్ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ అధికారాన్ని చేపట్టనున్నాడు.

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడమే కాదు.. లిబర్ పార్టీకి నాయకత్వం వహించడం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆయన తన సహ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రోజు ఒక క్లిష్టమైన వార్తను ఎదుర్కోవాల్సి వస్తున్నదని వివరించారు. కొందరు తమ సీట్లను కోల్పోయారని తెలిపారు. ఒక నేతగా తాను గెలుపు ఓటములకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. నాయకత్వంపై ఉన్న బాధ్యత, బరువులు అవే అని అన్నారు.

ఇందు మూలంగా.. పార్టీ నాయకత్వం నుంచి తాను దిగిపోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. కొత్త నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు చేయాల్సిన సరైన పని అదేనని వివరించారు. ఇన్ని రోజులు ఈ పార్టీని, దేశానికి నాయకత్వం వహించే అదృష్టం దక్కినందుకు సంతోషపడుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీనీ, దేశానికి తాను సారథ్యం వహించడానికి ఎంతో మంది సహాయపడ్డారని కూడా గుర్తు చేశారు. 

లిబర్ పార్టీ ఆస్ట్రేలియాలో సుమారు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నది. కానీ, ఇటీవల దేశంలో పర్యావరణ మార్పులపై తీవ్ర చర్చ జరుగుతున్నది. అడవుల్లో కార్చిచ్చు... కరువు, వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకే పర్యావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే డిమాండ్ ఈ ఎన్నికల్లో ఎక్కువగా చర్చకు వచ్చింది.

ఇదిలాా ఉండగా, ఈ నెలలోనే ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచన  చేశారు.తాను స్వ‌ల్ప‌ జ్వరంతో సహా ఫ్లూ లాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

క‌రోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ..  సిడ్నీలోని త‌న అధికార నివాసంలో ఐసోలేష‌న్లో ఉన్న‌ట్టు తెలిపారు.  మోరిసన్ మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

click me!