నేపాల్‌లో ఘోర ప్రమాదం: 28 మంది మృతి, మరో 12 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Oct 13, 2021, 11:30 AM IST
Highlights

నేపాల్ రాష్ట్రంలో జరిగిన బస్సు ప్రమాదంలో 28 మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటన వాయువ్య నేపాల్‌లోని కొండ ప్రాంతంలోని ముగు జిల్లాలో చోటు చేసుకొంది.

ఖాట్మాండ్: నేపాల్‌లో జరిగిన  బస్సు ప్రమాదంలో 28 మంది మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాయువ్య nepalలోని కొండ ప్రాంతంలోని mugu జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో బస్సులోని 28 మంది మృత్యువాత పడ్డారు.

also read:నేపాల్ లో ప్రకృతి విలయతాండవం... 38మంది మృతి, 50మందికి గాయాలు

బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయని కొందరు చెబుతున్నారు. అయితే బస్సు ముందు టైర్లలో ఒకటి పంక్ఛర్ కావడం వల్లే బస్సు అదుపు తప్పి లోయలో పడిందని జిల్లా అధికారి బహదూర్ మహత్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ బస్సు దక్షిణ banke జిల్లా నుండి ముగు ప్రాంతానికి వెళ్తోంది. హిందువులు అత్యంత సంబరంగా నిర్వహించుకొనే దశైన్ పండుగ కోసం 45 మంది ప్రయాణీకులు ఈ బస్సులో వెళ్తున్నారని స్థానికులు చెప్పారు.

మృతి చెందిన 28 మందిని గుర్తించాల్సి ఉంది. మరో వైపు ఈ ఘటనలో గాయపడిన 12 మందిని సమీపంోని ఆసుపత్రికి తరలించినట్టుగా మహత్ వివరించారు. ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగించారు.

ఈ బస్సులో ప్రయాణీస్తున్న ప్రయాణీకుల్లో కొందరు అధికారికంగా నమోదు కాలేదని అధికారులు చెప్పారు.  నేపాల్ లో ఈ రకమైన ప్రమాదాలు సాధారణంగా చోటు చేసకొంటాయని అధికారులు తెలిపారు. అధ్వాన్నమైన రోడ్లు, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో పాటు కండిషన్ లో లేని వాహనాలతో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.నేపాల్‌లో 2019లో  13 వేల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాల్లో 2,500 మంది మృత్యువాత పడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

click me!