అమెరికాలో ఇళ్లమీదే కుప్పకూలిన విమానం: ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

Published : Oct 12, 2021, 10:15 AM IST
అమెరికాలో ఇళ్లమీదే కుప్పకూలిన విమానం: ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

సారాంశం

అమెరికాలోని  శాన్‌ డియాగో శివారులో విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పలు ఇళ్లు, వాహనాలు దగ్దమయ్యాయి.

వాషింగ్టన్: అమెరికాలో ఇళ్ల మీద flight కుప్పకూలింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ప్రమాదంలో పలు ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యాయి.అమెరికాలోని San Diego శివారులో విమానం కుప్పకూలింది.

ఆరు సీట్ల ట్విన్ ఇంజన్ సెస్నా 340 ఆరిజోనా నుండి బయలుదేరి california బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. విమానం కుప్పకూలిన ఘటనలో రిటైర్డ్ దంపతులను స్థానికులు రక్షించారు. సుమారు 10 ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. డెలీవరీ ట్రక్కు సహా పలు వాహనాలు  దెబ్బతిన్నాయని అధికారులు ప్రకటించారు.

also read:రష్యాలో కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. తన ఇల్లు కంపించడంతో మైఖేల్ కిలీ అనే 43 ఏళ్ల మహిళ బయటకు పరుగెత్తింది. ఆ సమయంలో బయట ఉన్న ఓ ట్రక్కు మంటల్లో కాలిపోతుండడంతో పాటు పొరుగింటిలో మంటలు వ్యాపించడాన్ని గుర్తించింది. ఆ ఇంటిలో ఇద్దరు తనను పిలుస్తున్నట్టుగా ఆమె మీడియాకు తెలిపింది.పొరుగింటి మహిళ చేయి పట్టుకొని  ఆమె ప్రాణాలతో బయటపడేందుకు కిలీ సహాయపడింది. కిలీ చేతితో పాటు శరీరంపై గాయాలయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి