ఆయిల్‌ ట్యాంకర్ పేలి 20 మంది మృతి: 80 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Aug 15, 2021, 2:18 PM IST
Highlights

లెబనాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 20 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఇంధన కొరత కారణంగా దేశం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆర్మీ ఆధీనంలోని ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు. 

బీరూట్:లెబనాన్‌లో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఓ ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో  20 మంది మరణించారు.సుమారు 80 మంది గాయపడ్డారు.లెబనాన్‌ ఉత్తర్ ప్రాంతమైన అక్కర్ లో ఆయిల్ ట్యాంకర్ పేలినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు. దేశంలో తీవ్రమైన ఇంధన కొరత ఉంది. దీంతో తీవ్రమైన సంక్షోభం నెలకొంది.ఇంధన కొరత కారణంగా విద్యుత్ కోతలకు కారణమైంది.

లెబనాన్‌లో ఇంధన ట్యాంకటర్ పేలుడులో 20 మంది డెడ్‌బాడీలను స్వాధీనం చేసుకొన్నామని రెడ్‌క్రాస్ ట్విట్టర్‌లో ప్రకటించింది.సైన్యం జప్తు చేసిన ఇంధన కంటైనర్ పేలిందని జాతీయ వార్తాసంస్థ తెలిపింది.

ఆయిల్ ట్యాంకర్ చుట్టూ జనం గుమికూడి ఘర్షణకు దిగిన తర్వాత పేలుడు చోటు చేసుకొందని వార్తా సంస్థ ప్రకటించింది. ఈ పేలుడు జరగడానికి కొద్ది సేపటికి ముందే సైన్యం ఈ ప్రాంతం నుండి వచ్చిందని ఆ వార్తా సంస్థ తెలిపింది.

 ఏడు మృతదేహాలు డజన్ల కొద్ది కాలిన గాయాలతో  క్షతగాత్రులు చేరారని అక్కార్ ఆసుపత్రి ఉద్యోగి యాసిన్ మెట్లెజ్ చెప్పారు. ఈ ఘటనలో మృతదేహాలు బాగా కాలిపోయాయని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.  

మృతదేహలను గుర్తించని స్థితిలో ఉన్నాయన్నారు. కొందరు ముఖాలు కాలిపోతే కొందరి చేతులు కూడ కాలిపోయాయని సిబ్బంది చెప్పారు.తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న వారికి చికిత్స చేసేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.


 

click me!