బ్యాంక్ క్యాషియర్‌కు హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదు.. దొంగకు పరాభవం

By telugu team  |  First Published Aug 14, 2021, 2:01 PM IST

ఇంగ్లాండ్‌లో బ్యాంకు దోచుకోవడానికి వెళ్లిన ఓ దొంగ తన స్వదస్తూరి సరిగా లేక రెండుసార్లు విఫలమయ్యాడు. కస్టమర్ల క్షేమాన్ని ఆలోచించి మర్యాదగా క్యాష్ తీసి తనకు అప్పగించాల్సిందిగా రాసిన ఆ చిట్టీ బ్యాంకు క్యాషియర్‌కు అర్థం కాక బిక్కముఖంతో దొంగను చూశాడు. ఆయన ఏమీ చేయకుండా వెనక్కిమళ్లాడు. ఇలా మొత్తం మూడుసార్లు చేసిన ప్రయత్నాల్లో రెండుసార్లు విఫలమయ్యాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఆరేళ్ల శిక్ష పడింది.
 


న్యూఢిల్లీ: బ్యాంకు దోచుకుందామని వెళ్లిన ఓ దొంగకు తన చేతిరాత సరిగా లేక పరాభవం ఎదురైంది. తనను ఆ బ్యాంక్ రక్షకులు ఆపలేరని, క్యాషియర్ నుంచి డబ్బులు తీసి తన చేతిలో పెట్టాలని ఓ దొంగ స్వదస్తూరితో రాసిన చిట్టీని క్యాషియర్ చేతిలో పెట్టాడు. అంతేకాదు, బ్యాంకులోని కస్టమర్ల యోగక్షేమాల గురించి ఆలోచించుకోమని హెచ్చరించాడు. కానీ, ఆ చిట్టీ అందుకున్న బ్యాంకు క్యాషియర్‌కు అందులోని రాత అర్థం కాలేదు. బిక్కముఖం వేసి దొంగవైపు చూశాడు. విషయం అర్థమైన దొంగ ఏం చేయకుండా వెనుదిరిగాడు. ఇదే రీతిలో మరో బ్యాంక్‌లో దొంగతనం వర్కవుట్ అయింది. ఇంకో బ్యాంక్‌లోనూ ఇదే ట్రై చేశాడు. కానీ, బెడిసి కొట్టింది. ఇంతలోనే పోలీసులు అతన్ని పట్టేశారు. యూకేలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రిటైర్డ్ ఎంప్లాయి అలాన్ స్లాటరీ(67) మార్చి 18న ఈస్ట్‌బోర్న్‌లోని నేషనల్‌వైడ్ బిల్డింగ్ సొసైటీ బ్యాంకులోకి దోపిడీచేయడానికి వెళ్లాడు. డ్రాలోని డబ్బులు తీసి తన చేతికి అందించాల్సిందిగా రాసిన ఓ బెదిరింపు చిట్టీని బ్యాంకు సిబ్బందికి అందించాడు. కానీ, ఆయనకు ఆ చిట్టీలోని రైటింగ్ అర్థం కాలేదు. ఏమిటని దొంగవైపు చూశాడు. స్లాటరీ మౌనంగా బయటికి నడిచాడు.

Latest Videos

undefined

కానీ, తర్వాత ఆ బ్యాంకు ఉద్యోగి స్లాటరీ అందించిన లేఖను తీక్షణంగా చూస్తూ చదివే ప్రయత్నం చేశాడు. ఎట్లకేలకు అందులోని సారం అర్థం చేసుకుని గాబరా పడ్డాడు. సిబ్బంది వెంటనే పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు బ్యాంకుకు వెళ్లి ఆ చిట్టీని సీజ్ చేసుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

స్లాటర్ తన ప్రయత్నాలను ఆపలేదు. మార్చి 26న సెయింట్ లియోనార్డ్స్‌లోని నేషన్‌వైడ్ బిల్డింగ్ సొసైటీ బ్యాంకు బ్రాంచీలోకి వెళ్లాడు. ఈ సారి తన చేతి రాత ఫలితానిచ్చింది. క్యాషియర్ ఆ చిట్టీని చదివి ప్రాణభయంతో వణికిపోయింది. వెంటనే 2,400 పౌండ్‌ల నగదును స్లాటర్‌కు అప్పజెప్పింది. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బ్యాంకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. బ్యాంకు దోచుకున్న తర్వాత స్లాటరీ ఓ బస్సు ఎక్కి వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. వెంటనే బస్సు కంపెనీ సంప్రదించి ఆయన బస్సుపాసుపై చిత్రాన్ని సంపాదించారు. ఆ చిత్రం సీసీటీవీ ఫుటేజీ చిత్రంలోని వ్యక్తితో సరిపోలింది.

స్లాటరీ మరోసారి ఏప్రిల్ 1న బ్యాంకులో దొంగతనానికి హావ్‌లాక్ రోడ్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంకుకు వెళ్లాడు. ఈ సారి క్యాషియర్ టఫ్ పర్సన్. స్లాటరీ అందించిన చిట్టీ చదివి డబ్బు ఇవ్వనని తెగేసి చెప్పాడు. స్లాటరీ ఏం చేయకుండా మౌనంగా నిష్క్రమించాడు. స్లాటరీ వేటలోనే పోలీసులు ఇంతలోనే అక్కడికి చేరుకున్నారు. ఒక బ్యాంకు దొంగతనం, రెండు సార్లు చోరీ ప్రయత్నించారన్న అభియోగాలతో స్లాటరీని పోలీసులు అరెస్టు చేశారు. స్లాటరీ నేరాన్ని అంగీకరించాడు. అతనికి ఆరేళ్ల శిక్ష పడింది.

click me!