పొడవు పెరగడానికి రూ.1.35కోట్లు ఖర్చుపెట్టాడు..!

Published : Apr 15, 2023, 11:17 AM IST
పొడవు పెరగడానికి రూ.1.35కోట్లు ఖర్చుపెట్టాడు..!

సారాంశం

తాను అందరికీ ఎత్తుగా కనపడటం కోసం.. బూట్లలో కింద కొన్ని వస్తువులు కూడా పెట్టుకునేవాడు. అయినా కూడా ఎత్తు కనిపించేవాడు కాదట.


ఎత్తు పెరగడానికి ఓ వ్యక్తి దాదాపు రూ.1.35కోట్లు ఖర్చు పెట్టాడు. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీని కోసం  సుమారు $1,70,000 (రూ. 1.35 కోట్లు) వెచ్చించాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ (41)  కేవలం  5-అడుగుల-5-అంగుళాల ఎత్తు ఉండేవాడు.అయితే.. తాను ఎత్తు తక్కువగా ఉండటం వల్ల... అమ్మాయిలను ఆకర్షించలేకపోయాడట. అందుకే.. తాను ఎలాగైనా ఎత్తు పెంచుకోవాలని అనుకున్నాడు.  అతను తన ఎత్తును పెంచుకోవడానికి చాలా రకాల మందులు  వాడాడు. కానీ...అయినా ఎత్తు పెరగలేదు. తాను అందరికీ ఎత్తుగా కనపడటం కోసం.. బూట్లలో కింద కొన్ని వస్తువులు కూడా పెట్టుకునేవాడు. అయినా కూడా ఎత్తు కనిపించేవాడు కాదట.  చాలా మంది వైద్యులను కలిసినా... తనకు లాభం దొరకలేదట. ఎంత ప్రయత్నించినా ఎత్తు పెరగకపోవడంతో ఖర్చు ఎక్కువైనా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి రెడీ అయ్యాడు.


అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ,  ఉబెర్ డ్రైవర్‌గా పని చేయడం ద్వారా మూడు సంవత్సరాల వ్యవధిలో శస్త్రచికిత్స కోసం $75,000 ఆదా చేయగలిగాడు. మొదట ఆపరేషన్ తర్వాత మూడు అంగుళాలు పెరిగాడట. దానితో హ్యాపీగా ఫీలైనా... ఆతర్వాత మరో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మార్చిలో అతను.. తన ఎత్తుకు మరో 2 అంగుళాలు  పెంచుకోవడానికి రెండవ శస్త్రచికిత్స కోసం $98,000 ఖర్చు చేశాడు. ఎత్తు పెరగడం వల్ల తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని, మహిళతో మాట్లాడగలుగుతున్నానని అతను చెప్పడం విశేషం. ఈ చికిత్స విధానం చాలా నొప్పితో కూడుకున్నది అయినప్పటికీ.. అతను తృప్తిగానే ఉండటం విశేషం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?