పాకిస్థాన్ లో ముంబై 26/11 తరహా దాడి...ఉగ్రవాదుల చెరలోనే పర్యాటకులు

By Arun Kumar PFirst Published May 11, 2019, 7:53 PM IST
Highlights

మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడ్డ  ముగ్గురు ఉగ్రవాదులు అందులో  బసచేసిన అతిథులను బందీ చేశారు. మారణాయుధాలతో హోటల్ సిబ్బందిని, అతిథులను బెదిరించి  మొత్తం హోటల్ ను ఉగ్రవాదులు ఆదీనంలోకి  తీసుకున్నట్లు సమాచారం. 

గ్వదర్ పట్టణంలోని పెర్ల్స్ కాంటినెంటర్ హోటల్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సాయుధులైన  ముగ్గురు ఉగ్రవాదులు ఈ హోటల్లోకి చొరబడినట్లు  సమాచారం. అందులో వున్న సిబ్బందిని ఆయుధాలతో బెదిరించి  హోటల్లో బసచేసిన 95 శాతం మందిని నిర్బంధించినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు.  

ఉగ్రవాదుల చెరలో వున్నవారిని కాపాడేందుకు పాక్ రక్షణ శాఖ కు చెందిన అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హోటల్ పరిసరాలను తమ ఆదీనంలోకి తీసుకుని రక్షణ శాఖకు చెందిన  హెలికాప్టర్ సాయంతో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులు ప్రస్తుతం  హోటల్  మొదటి అంతస్తులో వున్నట్లు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో అతిథులకు ఎలాంటి హాని జరక్కుండా కాపాడే బాధ్యత తమదని రక్షణ అధికారులు హోటల్లో బంధీలుగా వున్నవారి  కుటుంబ  సభ్యులకు హామీ ఇస్తున్నారు. 

అయితే ఈ హోటల్లో విదేశీ పర్యాటకులు ఎవరూ బసచేయలేదని తమకు అందిన ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని  అధికారులు తెలిపారు. ప్రస్తుతం హోటల్లో నుండి  మాత్రం కాల్పుల  శబ్దాలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. అతి తొందర్లో ఉగ్రవాదుల చెరనుండి హోటల్లోని వారందరిని కాపాడతామని పాక్ అధికారులు హామీ ఇస్తున్నారు. 

click me!