బతికున్న ఆక్టోపస్ ని తిందామనుకుంటే...

Published : May 09, 2019, 04:18 PM IST
బతికున్న ఆక్టోపస్ ని తిందామనుకుంటే...

సారాంశం

ఎప్పుడు చనిపోయిన వాటిని వండి తినడమేనా..? బతికిన్నవి తింటేనే కదా అసలు మజా అనుకుంది ఓ యువతి. అనుకున్నది తడవుగా... ఓ బతికున్న ఆక్టోపస్ ని తెచ్చుకొని తిందామనుకుంది.


ఎప్పుడు చనిపోయిన వాటిని వండి తినడమేనా..? బతికిన్నవి తింటేనే కదా అసలు మజా అనుకుంది ఓ యువతి. అనుకున్నది తడవుగా... ఓ బతికున్న ఆక్టోపస్ ని తెచ్చుకొని తిందామనుకుంది. తాను ఆక్టోపస్ ని తినడాన్ని లైవ్ స్ట్రీమింగ్ లో తన ఫ్రెండ్స్  కి షేర్ చేయాలనుకుంది. కానీ... ప్రయత్నం బెడసి కొట్టి... ఆ ఆక్టోపస్ తో పోరాడాల్సి వచ్చింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాకు చెందిన ఓ యువతి ప్రాణంతో ఉన్న ఆక్టోపస్‌తో కడుపు నింపుకోవాలనుకుంది.  అయితే విన్యాసం కాస్తా బెడిసి కొట్టి, ఆ ఆక్టోపస్‌తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఏమాత్రం ఆ యువతికి నోటి చిక్కకుండా తన టెంటకిల్స్‌తో ఆమె చర్మాన్ని గట్టిగా పట్టుకుంది. ఆక్టోపస్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆ యువతి బాగానే కష్టపడింది.

ఆమె చర్మం గట్టిగా లాగడంతో... గాయమై రక్తం కూడా వచ్చింది. ఆమె ఎలా భయపడిందో.. ఆ వీడియోలో స్పష్టంగా కనపడింది. ఈ సంఘటన తర్వాత ఆ యువతి మళ్లీ ఇలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు. కావాలంటే ఆ వీడియోని మీరు కూడా చూడండి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..