హ్యాకింగ్ టూల్స్ చోరీ: అమెరికా వేలితో అమెరికా కన్నే పొడుస్తున్న డ్రాగన్

By Siva KodatiFirst Published May 9, 2019, 3:21 PM IST
Highlights

అమెరికా రక్షణ శాఖలోని అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హ్యాకింగ్ టూల్స్‌ను చైనాకు చెందిన గూఢచారులు తస్కరించారు. 

అమెరికా రక్షణ శాఖలోని అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హ్యాకింగ్ టూల్స్‌ను చైనాకు చెందిన గూఢచారులు తస్కరించారు. వాటిల్లో మార్పు చేసి అమెరికాతో సన్నిహితంగా మెలిగే ఆసియా, యూరప్‌లోని ప్రైవేట్ కంపెనీలపై దాడులు చేశారని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్ధ సిమాంటిక్ వెల్లడించింది.

చైనా ప్రభుత్వం కోసం పనిచేస్తున్న బకీస్ అనే హ్యాకర్ల బృందం ఎన్ఎస్ఏకు చెందిన రెండు హ్యాకింగ్ టూల్స్‌ని హ్యాక్ చేశారు. వీటిలో మార్పు చేసి బెల్జియం, లక్సంబర్గ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్‌లోని పరిశోధనా కేంద్రాలు, విద్యా సంస్ధలు, కంప్యూటర్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.

దీంతో అమెరికా తన సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని కీలక టూల్స్‌‌పై పట్టు కోల్పోయినట్లు సమాచారం. ఇది ఒక వ్యక్తి నుంచి తుపాకీని లాక్కోని అదే వ్యక్తిని కాల్చేయడ వంటిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా నుంచి అపహరించిన  మాల్‌వేర్ టూల్స్ సాయంతో చైనా అమెరికా రక్షణ రంగ కంపెనీలనే టార్గెట్ చేసింది. ఈ చర్య ద్వారా చైనాకు చెందిన సైబర్ హ్యాకర్లు అమెరికా హ్యాకర్ల కంటే స్పెషలిస్టులన్న విషయం స్పష్టమవుతోంది. 

click me!