పంది గుండె మార్పిడి పొందిన తొలి వ్య‌క్తి మృత‌దేహంలో జంతు వైర‌స్ గుర్తింపు..

Published : May 06, 2022, 10:10 AM IST
పంది గుండె మార్పిడి పొందిన తొలి వ్య‌క్తి మృత‌దేహంలో జంతు వైర‌స్ గుర్తింపు..

సారాంశం

మానవ చరిత్ర తొలిసారిగా పంది మార్పిడి చేయించుకొని కొంత కాలం తరువాత చనిపోయిన వ్యక్తిలో జంతు వైరస్ ను పరిశోధకులు గుర్తించారు. అయితే అది మనిషికి ప్రమాదకరమైనదో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని పరిశోధకులు చెప్పారు.  

చరిత్రలో తొలిసారిగా పంది గుండె ను అమ‌ర్చుకున్న వ్య‌క్తి రెండు నెల‌ల పాటు జీవించి అనంత‌రం చ‌నిపోయాడు. అయితే అత‌డి మృతికి కార‌ణాలు ఏంటనే విష‌యంలో శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. అందులో వారు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాన్ని తెలుసుకున్నారు. అత‌డి మృత‌దేహంలో జంతు వైరస్ ఉందని కనుగొన్నారు. అయితే ఇది మనిషి మరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంద‌నే దానిపై ఇంకా క్లారిటీ లేద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. 

మొద‌టి సారిగా పంది గుండె మ‌నిషికి అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో జ‌రిగింది. ఆ ఆప‌రేష‌న్ 57 ఏళ్ల  డేవిడ్ బెన్నెట్ కు జ‌రిగింది. ఈ స‌ర్జ‌రీ సంచలనం సృష్టించింది. గుండె మార్పిడి చికిత్స‌ల్లో ఇది విప్ల‌వాత్మ‌కం అని ప‌రిశోధ‌కులు అభివ‌ర్ణించారు. అయితే ఈ స‌ర్జ‌రీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 7వ తేదీన జ‌రిగింది. అయితే రెండు నెల‌ల త‌రువాత అత‌డు ఈ మార్చిలో మరణించాడు. అత‌డు ఎందుకు మ‌ర‌ణించాడ‌నే కోణంలో శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ విష‌యంలో యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు గురువారం మాట్లాడారు. పంది గుండె లోపల వైరల్ DNA. పోర్సిన్ సైటోమెగలో వైరస్ ను గుర్తించారు. ఇది ప్ర‌త్య‌క్షంగా ఇన్ఫెక్ష‌న్ కు గురి చేస్తుంద‌ని గుర్తించ‌లేద‌ని చెప్పారు. 

ఈ ఆప‌రేష‌న్ పూర్త‌యిన త‌రువాత ఇక మ‌నుషుల గుండె మార్పిడి సుల‌భం అయిన‌ట్టే అని అంద‌రూ భావించారు. కానీ ఇలా జంతువుల నుంచి గుండె మార్పిడి చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కొత్త వ్యాధుల‌ను ప‌రిచయం చేసే ప్రమాదం ఉంటుంద‌ని ఈ ప‌రిశోధ‌న త‌రువాత తెలిసింది. ‘‘ కొన్ని వైరస్‌లు సైలెంట్ గా ఉంటాయి. అంటే అవి వ్యాధిని కలిగించకుండా దాగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు గుర్తించిన వైర‌స్ ప్ర‌మాద‌క‌రమైద‌ని కాక‌పోవ‌చ్చు. ’’ అని డేవిడ్ బెన్నెట్ కు గుండె మార్పిడి చేసిన డాక్డర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. గత నెలలో అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గ్రిఫిత్ ఇచ్చిన శాస్త్రీయ ప్రదర్శనను తెలియజేస్తూ MIT టెక్నాలజీ రివ్యూ ద్వారా మొదటి సారిగా ఈ జంతు వైరస్ మొదటిసారిగా గుర్తించారు. 

దశాబ్దాల కాలంగా జంతువుల అవయవాలను ఉపయోగించి మానవ ప్రాణాలను కాపాడటానికి డాక్టర్లు  ప్రయత్నిస్తున్నారు. ఆ విష‌యంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో 57 ఏళ్ల బెన్నెట్ కు మానవ గుండె మార్పిడికి అనర్హుడని గుర్తించారు. దీని కోసం వేరే జంతువు గుండెను అమ‌ర్చాల‌ని నిర్ణ‌యించారు. అయితే అత‌డి రోగనిరోధక వ్యవస్థ వేరే జంతువు అవ‌య‌వాన్ని వేగంగా తిరస్కరించే ప్రమాదం ఉంది. దీని కోసం జన్యుపరంగా మార్పు చేసిన పంది నుండి గుండెను ఉపయోగించి చివరి ఆపరేషన్ చేశారు. 

దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఆప‌రేష‌న్ కు అవ‌స‌ర‌మైన అన్ని పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని ఈ ఆప‌రేష‌న్ చేసిన మేరీల్యాండ్ హాస్పిట‌ల్ బృందం తెలిపారు. జంతువులకు అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో పెంచార‌ని చెప్పారు. అయితే ఈ జంతువును అందించిన Revivicor అనే సంస్థ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

ఆప‌రేష‌న్ జ‌రిగి బెన్నెట్ బాగా కోలుకుంటున్న స‌మ‌యంలో రెండు నెల‌ల త‌రువాత అత‌డు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అత‌డికి ఎందుకు అలా జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి డాక్లర్లు అనేక ప‌రీక్ష‌లు చేశారు.  అత‌డికి అనేక రకాల యాంటీబయాటిక్‌లు, యాంటీవైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సను అందించారు. కానీ పంది గుండె ఉబ్బి, ద్రవంతో నిండిపోయి చివరికి పని చేయడం మానేసింది. దీంతో అత‌డు మ‌ర‌ణించాడు. 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే