ప్రపంచంలోనే అతి ఎత్తైన మహిళ పేరిట మరో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అవేంటో తెలుసా?

Published : May 04, 2022, 06:23 PM IST
ప్రపంచంలోనే అతి ఎత్తైన మహిళ పేరిట మరో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అవేంటో తెలుసా?

సారాంశం

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహిళగా గిన్నిస్ రికార్డు నమోదు చేసిన ఓ మహిళ తాజాగా మరో మూడు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. టర్కీకి చెందిన రుమెసా గెల్గీ అతి ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఆమె తాజాగా తన వేలు, చేయి, బ్యాక్ అతి పొడవైనవిగా రికార్డు సృష్టించారు.

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు టర్కీకి చెందిన రుమెసా గెల్గి పేరిట ఉన్నది. ఆమె మరో మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. టర్కీకి చెందిన ఆ మహిళ తన పేరిట ఐదు వరల్డ్ రికార్డులు కలిగి ఉండటంపై గర్విస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చేపట్టిన వెరిఫికేషన్‌లో ఆమె పేరిట మరో మూడు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.

ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న మహిళ అతి పొడవైన చేతి వేలు (11.2 సెంటిమీటర్లు). అతి పెద్దదైన చేయి ఉన్న మహిళగా మరో రికార్డు తన పేరిట లిఖించుకుంది. ఆమె కుడి చేయి 24.93 సెంటిమీటర్ల పొడవు ఉన్నది. ఎడమ చేయి 24.26 సెంటిమీటర్లుగా ఉన్నది. అతి పొడవైన వీపు(బ్యాక్)గానూ ఆమె రికార్డు ఉన్నది.

రుమెసా గెల్గి 1997 జనవరి 1వ తేదీన జన్మించారు. ఆమె న్యాయవాది, రీసెర్చర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. 2021 నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో అతి ఎత్తైన మహిళగా రికార్డు ఆమె పేరిట ఉన్నది. ప్రస్తుతం ఆమె ఎత్తు 215.16 సెంటిమీటర్లు ఉన్నట్టు తేలింది. అంటే 7.7 ఫీట్లు. 

ఆమె వెరిఫికేషన్ తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డు అకౌంట్ ఓ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో గెల్గీ ఆమె జననం, ఆమె వ్యాధి, ఆమె గురించి ఎన్నో విషయాలను ఆ వీడియోలో రుమెసా గెల్గి వివరించారు. 

తాను పుట్టడమే ఒక రకమైన భౌతిక లోపంతో పుట్టానని చెప్పారు. తాను బాలికగా ఉన్నప్పటి నుంచి తన వ్యాధి కారణంగా ఎన్నోసార్లు వేధింపులకు గురయ్యానని వివరించారు. తాను తన తొలి రికార్డు టైటిల్ 2014లో పొందారని, తాను అప్పుడు టీనేజీలో ఉన్నారని తెలిపారు. గెల్గీ వీల్ చైర్ సహాయంతోనే కదులుతారు. నడిచినా చాలా తక్కువ దూరమే. ఎందుకంటే ఆమె శారీరక లోపం సహకరించదు. కానీ, తాను తన లోపాన్ని చూసి కుంగిపోవడం లేదని ఆమె చెప్పారు. ఒక్కోసారి మన లోపాలను ప్రయోజనాలుగా మార్చుకోవాలని తెలిపారు.

గెల్గీ పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టారు. అలాగే పెరిగారు. అదే లోపంతో ఆమె ఇప్పటికీ బాధపడుతున్నారు. అయితే, ఆమె కుటుంబీకులు ఆమెకు అన్ని విధాల సహకరిస్తుంటారు. అందుకే ఆమె సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, టర్కీలోనే ప్రపంచలోనే ఎత్తైన పురుషుడూ ఉన్నారు. కానీ, ఆయన వేరే సమస్యతో అంతగా పెరిగారు. ఆయనకు బ్రెయిన్‌లో ఏదో సమస్య కారణంగా ఆయన ఎత్తు ఎక్కువ పెరిగినట్టు తెలిసింది. అయితే, వీరిద్దరిదీ ఒకే దేశం అయినప్పటికీ వీరిరువురూ ఇది వరకు కలువలేదు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే