ట్రెడ్‌మిల్‌పై చీలమండ మడతపడి.. మాంసం తినే బాక్టీరియా ఇన్ ఫెక్షన్ సోకడంతో 11యేళ్ల బాలుడు మృతి..

Published : Feb 17, 2023, 12:25 PM IST
ట్రెడ్‌మిల్‌పై చీలమండ మడతపడి.. మాంసం తినే బాక్టీరియా ఇన్ ఫెక్షన్ సోకడంతో 11యేళ్ల బాలుడు మృతి..

సారాంశం

ఓ పదకొండేళ్ల బాలుడు భయంకరమైన మాంసం తినే బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ బారిన పడ్డాడు. ట్రెడ్ మిల్ చేస్తున్నప్పుడు చీలమండ మడతపడి ఇలా జరిగింది. దానికి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. 

అమెరికా : యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాలో 11 ఏళ్ల బాలుడు ట్రెడ్‌మిల్‌ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో అతని చీలమండ మెలితిరిగింది. అది మాంసం తినే బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసింది. దీంతో అతను మృతి చెందడంతో స్తానికంగా విషాదం నెలకొంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెడితే.. 

మృతి చెందిన బాలుడి పేరు జెస్సీ బ్రౌన్. ఈ బాలుడి కుటుంబం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, జెస్సీ ఐదవ తరగతి చదువుతున్నాడు. చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాడు. జెస్సీ మోటోక్రాస్ రైడ్ చేసేవాడు. ట్రెడ్‌మిల్‌ మీద తన చీలమండను మెలితిరగడానికి ముందు ఎప్పుడూ అలాంటి రైడ్స్ లోనే ఉండేవాడు. బహుశా కొన్ని వారాల క్రితమే ఈ ఇన్ ఫెక్షన్ అతనికి సోకింది. అదే అతని మరణానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. 

కొన్ని వారాల క్రితం, ట్రెడ్‌మిల్ వాడుతున్నప్పుడు జెస్సీ బ్రౌన్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత, జెస్సీ కాలు మొత్తం ఒకరకమైన ఊదా, ఎరుపు రంగు మచ్చలతో ఉండడం.. ఉబ్చినట్టుగా కనిపించడం కుటుంబసభ్యులు గమనించారు. ఆ మచ్చలు గాయాలను పోలి ఉన్నాయి. అతడిని పరీక్షించిన వైద్యులు బ్రౌన్‌కు గ్రూప్ ఏ స్ట్రెప్ ఇన్‌ఫెక్షన్ ఉందని అది మాంసాన్ని తినే బ్యాక్టీరియాగా అభివృద్ధి చెందిందని తెలియజేశారు. బ్రౌన్‌ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు.

పైలట్ తప్పిదం వల్లే నేపాల్ విమాన ప్రమాదం.. వెల్లడించిన ప్రైమెరీ క్రాష్ రిపోర్టు

"అతడి చీలమండ ట్విస్ట్ అయినందున ఇన్ఫెక్షన్ ఆ ప్రాంతంలో దాడి చేసే అవకాశం ఉందని వారు అన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం దెబ్బవల్ల బలహీనంగా ఉండడమే" అని జెస్సీ బ్రౌన్ బంధువు మేగాన్ బ్రౌన్ చెప్పారు. ఓర్లాండోకు చెందిన శిశువైద్యుడు డాక్టర్ కాండిస్ జోన్స్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో పిల్లలలో ఇన్వాసివ్ స్ట్రెప్-ఎ కేసులు ఇటీవల పెరిగాయి.

"ఆ కేసుల్లో కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తర్వాత ప్రారంభమయ్యాయని  ఊహాగానాలు ఉన్నాయి, అంటువ్యాధుల తరువాత ఆ రకమైన ఇన్ఫెక్షన్లలో పెరుగుదలను గమనిస్తున్నాం. అందువల్ల ఈ బ్యాక్టీరియా తేలికపాటి నుండి తీవ్రమైన పరిస్థితులకు దారితీసే అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ గా మారొచ్చు, మరణం కూడా సంభవించవచ్చు" అని డాక్టర్ జోన్స్ వివరించారు.

ఇరాక్‌లో 5,000 ఏళ్ల క్రితమే పబ్, అందులో ఫ్రిడ్జ్, బీర్‌లు, మాంసం ఆనవాళ్లు కనుగొన్న ఆర్కియాలజిస్టులు

గ్రూప్-ఎ స్ట్రెప్ అనేది గొంతు నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియా. డా. జోన్స్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. చాలా కేసులు అంత తీవ్రంగా ఉండవు, కానీ చాలా అరుదైన సందర్భాల్లో, ఇది మాంసం తినే వ్యాధి వంటి ద్వితీయ సంక్రమణకు కారణమవుతుంది. వాపు, ఎరుపు, దుర్వాసన, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆమె అన్నారు.

గ్రూప్ ఎ స్ట్రెప్టోకోకస్ (గ్రూప్ ఎ స్ట్రెప్) అని పిలువబడే బాక్టీరియా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. సిడిసి ప్రకారం, ఈ అంటువ్యాధులు చిన్న అనారోగ్యాల నుండి మొదలై చాలా తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధుల వరకు దారి తీస్తాయి. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే