
వాషింగ్టన్ : same-sex marriagesకు రక్షణ కల్పించేలా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది ఈ వివాహాలకు భద్రత కల్పించే బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం తెలిపింది. Right to Abortionలను తొలగిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అమెరికా చట్టసభ సభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లు ప్రవేశం సందర్భంగా సభలో వాడివేడి చర్చ జరిగింది ఈ వివాహాలకు డెమోక్రాట్లు మద్దతు పలకగా కొంతమంది రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకించారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించాలని, ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనవసరమైన చర్యగా పలువురు రిపబ్లికన్ చట్ట సభ్యులు పేర్కొన్నారు. అయితే, 47మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో 267- 157 ఓట్ల తేడాతో బిల్లు సభ ఆమోదం పొందింది. రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ బిల్లును తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. సభ్యులు సైతం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లుకు మద్దతు పలికినట్లు సమాచారం. అయితే, బిల్లుకు ఆమోదం లభించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. సాధారణ పౌరులు స్వలింగ సంపర్కుల వివాహాల పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. జూన్ లో నిర్వహించిన ఓ సర్వేలో 70 శాతం అమెరికా వయోజనులు ‘గే’ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరారు. డెమోక్రాట్ లలో 88 శాతం మంది, రిపబ్లిక్ గంటలో 55 శాతం మంది స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు పలికారు.
అబార్షన్ హక్కును కాపాడుతూ బైడెన్ ఉత్తర్వు.. కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని ఆదేశాలు...
మంగళవారం ఓటింగ్‌కు ముందు, అనేక మంది చట్టసభ సభ్యులు సుప్రీంకోర్టు వెలుపల అబార్షన్ తీర్పును వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు మద్ధతుగా వారితో చేరారు. దీంతో భద్రత కారణాల రీత్యా అరెస్టులు చేశారు. ఇలా అరెస్టయిన వారిలో 16 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని క్యాపిటల్ పోలీసులు తెలిపారు.
జూన్‌లో రిపబ్లికన్లు 50 ఏళ్ల రోయ్ v. వేడ్ తీర్పును కొట్టివేసినప్పుడు అబార్షన్ యాక్సెస్‌పై మాత్రమే దృష్టి సారించారు. స్వలింగ వివాహం, ఇతర హక్కులకు ముప్పు లేదని వారు వాదించారు. వాస్తవానికి, చర్చ సందర్భంగా మాట్లాడేందుకు వచ్చిన రిపబ్లికన్లలో దాదాపు ఎవరూ స్వలింగ లేదా వర్ణాంతర వివాహం గురించి నేరుగా ప్రస్తావించలేదు.
డిఫెన్స్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్, 1996 చట్టం, ఒబామా కాలం నాటి కోర్టు తీర్పుల ద్వారా పక్కన పెట్టబడింది, ఇందులో దేశవ్యాప్తంగా ఒబెర్గెఫెల్ వర్సెస్ హోడ్జెస్, ‘గే’ జంటలు వివాహం చేసుకునే హక్కులను ఎస్టాబ్లిష్ చేశారు. ‘గే’ హక్కులకు సంబంధించిన లాండ్ మార్క్ కేసు ఇది. అయితే గత నెలలో, రో వర్సెస్ వాడేను రద్దు చేయడంతో.. అమెరికన్లకు హామీ ఇవ్వబడిన హక్కుల గురించి మరింత వివరణ కోసం కొందరు వాదించారు. ఇక అబార్షన్ హక్కు రాజ్యాంగంలో పేర్కొనబడలేదు.