బ్రిటన్ ప్రధాని పదవికి అడుగుదూరంలో రిషి సునాక్.. ఐదో రౌండ్‌లోనూ విజయం

Siva Kodati |  
Published : Jul 20, 2022, 09:02 PM ISTUpdated : Jul 20, 2022, 09:08 PM IST
బ్రిటన్ ప్రధాని పదవికి అడుగుదూరంలో రిషి సునాక్.. ఐదో రౌండ్‌లోనూ విజయం

సారాంశం

బ్రిటన్ ప్రధాని పదవికి మరో అడుగు దూరంలో నిలిచారు భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునాక్. ఐదో రౌండ్‌లోనూ ఆయన తొలి స్థానంలో నిలవగా.. లిజ్ ట్రస్ రెండో స్థానంలో నిలిచారు.

బ్రిటన్ ప్రధాని పదవికి మరో అడుగు దూరంలో నిలిచారు భారత సంతతికి చెందిన రాజకీయ వేత్త రిషి సునాక్. ఐదో రౌండ్‌లోనూ ఆయన తొలి స్థానంలో నిలవగా.. లిజ్ ట్రస్ రెండో స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్‌లో రిషి సునాక్‌కు 137 ఓట్లు, లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

Also Read:ఎవ‌రీ రిషి సున‌క్‌? బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తి వ్య‌క్తి..

కాగా.. 49 ఏళ్ల రిషి సున‌క్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు. వారిద్ద‌రూ కాలిఫోర్నియాలో చదువుతున్నప్పుడు కలిశారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. కాగా బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచారంలో రిషి సునక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయ‌న 2015లో తొలిసారి ఎంపీ అయ్యారు. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బయటకు రావాలన్న బోరిస్ జాన్సన్ విధానానికి ఆయన మద్దతు తెలిపారు. అయితే ఖజానా ఛాన్సలర్‌గా సునక్ రాజీనామా చేసిన తర్వాత బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో కూడా ఒక్కొక్క‌రు రాజీనామాలు చేయ‌డం ప్రారంభించారు దీంతో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రిషి సున‌క్ బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌డితే.. బ్రిటీష్ ప్రధాని అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి గా చ‌రిత్ర సృష్టిస్తాడు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !