గగనతలంలో ఎగిరే మరో వస్తువును కూల్చేసిన అమెరికా.. వారం రోజుల్లో ఇది నాలుగో ఘటన

Published : Feb 13, 2023, 09:50 AM IST
గగనతలంలో ఎగిరే మరో వస్తువును కూల్చేసిన అమెరికా.. వారం రోజుల్లో ఇది నాలుగో ఘటన

సారాంశం

అమెరికా గగనతలంలో మరో ఎగిరే వస్తువు ఆందోళన రేకెత్తించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు దానిని కూల్చివేశారు. అమెరికా-కెనడా సరిహద్దులోని మిచిగాన్ ఎగువ ద్వీపకల్పం, హురాన్ సరస్సుపై దీనిని ధ్వంసం చేశారు. 

అమెరికా-కెనడా సరిహద్దులోని మిచిగాన్ ఎగువ ద్వీపకల్పం, హురాన్ సరస్సు గగనతలంపై ఎగురుతున్న వస్తువును అమెరికా కూల్చివేసింది. గత వారం రోజుల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం నాలుగోది. కొన్ని రోజుల కిందట చైనా నిఘా బెలూన్ ను ఉత్తర అమెరికా భద్రతా దళాలను కూల్చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా భద్రతా దళాలు హై అలర్ట్ లో ఉన్నాయి.

టర్కీలో మరోసారి భూకంపం.. తీవ్రత 4.7గా నమోదు..

తాజా ఘటన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల ప్రకారం జరిగాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి ‘రాయిటర్స్’తో తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. యూఎస్-కెనడా సరిహద్దులోని హురాన్ సరస్సుపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:42 గంటలకు యూఎస్ ఎఫ్-16 యుద్ధ విమానం ఆ వస్తువును కూల్చివేసిందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

కాగా.. ఈ ఎగిరే వస్తువు సైనిక ముప్పును కలిగి లేనప్పటికీ 20,000 అడుగుల (6,100 మీ) వద్ద ప్రయాణించడం వల్ల దేశీయ విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఇది నిఘా కోసం ఉపయోగపడకపోవచ్చని ‘ది పెంటగాన్ (యూఎస్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్)’ తెలిపింది. ఈ వస్తువు అష్టభుజి ఆకారంలో ఉంది. దీనికి తీగలు వేలాడుతున్నాయి కానీ ఎలాంటి పేలోడ్ ను అధికారులు గుర్తించలేదు. ఈ వస్తువు ఇటీవల మోంటానాలో సున్నితమైన సైనిక ప్రదేశాలకు సమీపంలో గుర్తించారు.

ఢిల్లీలోని కూలర్ ఫ్యాక్టరీలో ఘోరం.. లిఫ్ట్ లో ఇరుక్కొని 15 ఏళ్ల బాలుడు మృతి.. ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు

ఈ తాజా ఘటన ఇటీవలి ఉత్తర అమెరికా ఆకాశంలో కనిపించిన అసాధారణ వస్తువు వల్ల కలిగిన ఆందోళనలను లేవనెత్తింది. చైనాతో ఉద్రిక్తతలను పెంచింది. అమెరికా ఆకాశంలో ఎగురుతూ ఇలా ధ్వసం అయిన వస్తువు గత వారం రోజుల్లో ఇది నాలుగోది. యూఎస్ అధికారులు మొదటి ఎగిరే వస్తువును చైనీస్ నిఘా బెలూన్‌గా గుర్తించారు. అయితే దీనిని చైనా ఖండించింది. ఇది పౌర పరిశోధన క్రాఫ్ట్ అని చెప్పింది. దీనిని ఫిబ్రవరి 4న సౌత్ కరోలినా తీరంలో దానిని కాల్చివేశారు. శుక్రవారం అలస్కాలోని డెడ్‌హోర్స్ సమీపంలో సముద్రపు మంచు మీద రెండో వస్తువును కాల్చేశారు. కెనడాలోని యుకాన్ మీద మూడో వస్తువును ధ్వంసం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే