మెక్సికో లో అగాథా తుఫాను బీభత్సం.. 11 మంది మృతి, 22 మంది గల్లంతు

Published : Jun 02, 2022, 04:12 AM IST
మెక్సికో లో అగాథా తుఫాను బీభత్సం.. 11 మంది మృతి, 22 మంది గల్లంతు

సారాంశం

మెక్సికో లో హ‌రికేన్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ హరికేన్ ఎంతో నష్టాన్ని మిగిలిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. మరో 22 మంది కనిపించకుండా పోెయారు. ఈ గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

మెక్సికోలోని పసిఫిక్ తీరాన్ని తాకిన అగాథా హ‌రికేన్ కారణంగా కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. మరో 22 మంది గల్లంతయ్యారు. ఈ విష‌యాన్ని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది. ఈ హ‌రికేన్ వ‌ల్ల మారుమూల పర్వత సముదాయాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హువాటుల్కో మున్సిపాలిటీలోని ప్యూంటే కోపాలిటా కమ్యూనిటీ నివాసితుల ఇళ్లు హరికేన్ లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

Sourav Ganguly : రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు.. ఎడ్యుకేష‌నల్ యాప్ తీసుకొస్తున్నా - సౌర‌వ్ గంగూలీ

గల్లంతైన వారిని గుర్తించడానికి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ హ‌రికేన్ వ‌ల్ల 11 మంది మృతి చెంద‌డం ప‌ట్ల అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ విచారం వ్యక్తం చేశారు. తప్పిపోయిన వ్యక్తులను త్వరలోనే కనుగొంటామని ఆయన తెలిపారు. 

ఈ సీజన్ లో ఇది మొదటి హరికేన్. యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ (ఎహెచ్ హెచ్ సీ) ప్రకారం 1949 నుంచి ఇది మేలో మెక్సికోను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను. ఇది కేటగిరీ టూ హరికేన్ గా సోమవారం ఓక్సాకాలోని ప్యూర్టో ఏంజెల్ సమీపంలో తీరం దాటింది. అయితే తీరప్రాంత పర్యాటక పట్టణాలను ఢీకొట్టిన త‌రువాత ఇది లోతట్టుకు తరలివెళ్ళడంతో బలహీనపడింది. 

ఈ తుఫాను కారణంగా దక్షిణ మెక్సికోలో భారీ వర్షం కురిసింది. మెక్సికో వాతావరణ కేంద్రం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాబోయే ఐదు రోజుల్లో తుఫాను భాగం అట్లాంటిక్ వైపు కదులుతుందని, మరొక తుఫాను ఏర్పడే అవకాశం 80 శాతం వ‌ర‌కు ఉంద‌ని పేర్కొంది. 

బిన్ లాడెన్ ఫొటోను ఆఫీసులో పెట్టిన గవర్నమెంట్ అధికారి.. వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ అంటూ రాసి మరీ..

కాగా మే, నవంబర్ నెలల మధ్య, మెక్సికో సాధారణంగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల నుండి ఉష్ణమండల తుఫానులు వ‌స్తుంటాయి. గత సంవత్సరం,గ్రేస్ మూడో హరికేన్ మెక్సికోను తాకింది. దీని వ‌ల్ల దాదాపు 11 మంది మరణించారు. 1997 లో కేటగిరీ 4 పౌలిన్ హరికేన్ దేశంలోని పసిఫిక్ తీరాన్ని తాకిన తరువాత దాదాపు 200 మంది చ‌నిపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే