Monkeypox : మంకీపాక్స్ క‌ల‌క‌లం.. లండ‌న్ లో యువకుల్లో అధికంగా వ్యాప్తి

Published : Jun 02, 2022, 03:19 AM IST
Monkeypox : మంకీపాక్స్ క‌ల‌క‌లం.. లండ‌న్ లో యువకుల్లో అధికంగా వ్యాప్తి

సారాంశం

లండన్ లో వెలుగులోకి వచ్చిన మంకీ పాక్స్ కేసుల్లో బాధితులు అధికంగా యువకులే ఉన్నారని అక్కడి అధికారులు తెలియజేశారు. ఈ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తులతో లైంగిక చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తుున్నారు. 

మంకీపాక్స్ వైర‌స్ రోజు  రోజుకు త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటూ పోతోంది. అయితే ప్రస్తుత మంకీపాక్స్ వ్యాప్తి ఎక్కువగా లండన్‌లోని యువకులను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఎవ‌రైనా ఈ వైర‌స్ బారిన ప‌డ‌వ‌చ్చ‌ని, అయితే ఇంగ్లాండ్‌లో ఈ వ్యాధికి గురైన 183 మందిలో 111 మంది యువ‌కులే ఉన్నార‌ని అధికారులు చెబుతున్నారు. 

మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించదు కానీ సన్నిహిత పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. అయితే యూకే అధికారులు కేసులను అనుసంధానించే ఏ ఒక్క కారకాన్ని గుర్తించలేదని చెప్పారు. కాగా LGBT సమూహాలు, ఈవెంట్ల‌లో పాల్గొన్న వారు త‌మ హెల్త్ కండీష‌న్లును తెలియ‌జేయాల‌ని అధికారులు కోరుతున్నారు. ప్రజలు తమ శరీరంలోని ఏ భాగంలోనైనా కొత్త మచ్చలు, అల్సర్లు లాంటివి ఏమైనా  ఏర్ప‌డ్డాయా అనే విష‌యం చూడాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఎవ‌రైనా కొత్త వ్య‌క్తితో లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొన్న వారు దీనిని గ‌మ‌నించాల‌ని సూచిస్తున్నారు. 

Sourav Ganguly : రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు.. ఎడ్యుకేష‌నల్ యాప్ తీసుకొస్తున్నా - సౌర‌వ్ గంగూలీ

వైర‌స్ విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌లు ఇత‌రుల‌తో సంపర్కాన్ని పరిమితం చేయాలని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్ప‌టికే ఏవైనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే సాధ్యమైనంత తొంద‌ర‌గా ఎన్ హెచ్ ఎస్ 111 లేదా స్థానిక లైంగిక ఆరోగ్య సేవను ఫోన్ ద్వారా సంప్రదించాల‌ని తెలియ‌జేశారు. సాధార‌ణంగా తేలిక‌పాటి లక్షణాలు ఉంటే మూడు మూడు వారాల్లోగా వాటంతట అవే క్లియర్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. 

మే నెల ప్రారంభం నుండి ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ లో 183, స్కాట్లాండ్ లో నాలుగు, ఉత్తర ఐర్లాండ్ లో రెండు, వేల్స్ లో ఒక కేసు మొత్త‌గా 190 మంకీపాక్స్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) మొదటిసారిగా ప్రస్తుత వ్యాప్తిలో ప్రభావితమైన వాటి విష‌యంలో మ‌రింత స‌మాచారాన్ని అందించింది. ఇంగ్లాండ్‌లో ఈ వైర‌స్ సోకిన 86 శాతం మంది లండన్‌లో నివసిస్తున్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే మహిళలు. చాలా మంది 20 నుండి 49 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. 

UKHSA ఇంగ్లండ్‌లో ధృవీకరించబడిన కేసులలో 18 శాతం మంది ఇటీవల ఐరోపాలోని అనేక దేశాలకు వెళ్లినట్లు తెలిపింది. ల‌క్ష‌ణాలు వెలుగులోకి రాక మూడు వారాల ముందే వారి ప్ర‌యాణం సాగింద‌ని పేర్కొంది. ఆరోగ్య అధికారులు ఈ కేసుల హై రిస్క్ కాంటాక్ట్‌లుగా ఉన్న వ్యక్తులను సంప్రదిస్తున్నారు. వారిలో కొంతమందిని 21 రోజుల వరకు ఇంట్లో ఒంటరిగా ఉండాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

బిన్ లాడెన్ ఫొటోను ఆఫీసులో పెట్టిన గవర్నమెంట్ అధికారి.. వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ అంటూ రాసి మరీ..

మంకీపాక్స్‌కి వ్యతిరేకంగా ప‌ని చేసే వ్యాక్సిన్‌ని ఇమ్వానెక్స్ అని పిలుస్తారు. ఇది ముందుగా ఆరోగ్య కార్యకర్త‌ల‌కు అందిస్తున్నారు. ఎందుకంటే ట్రీట్ మెంట్ అందించే స‌మ‌యంలో వారు ఇన్‌ఫెక్షన్ బారిన ప‌డ‌కుండా, వ్యాప్తికి కార‌కంగా కాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారు. కాగా మంకీపాక్స్ కేసులు ఇటీవల వ్యాప్తి చెందడం వెనుక అస‌లైన కార‌ణంగా ఏంటనేది శాస్త్రవేత్తలకు స్పష్టంగా అర్థం కాలేదు. UK, ఇతర ప‌లు దేశాల్లో గే బార్‌లు, ఆవిరి స్నానాలు, డేటింగ్ యాప్‌ల వినియోగానికి సంబంధించిన లింక్ లు  ప‌లు కేసుల్లో గుర్తించిన‌ట్టు UKHSA తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే