భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. కానీ ఇది సమయం కాదు.. టీ20లో భారత్‌పై పాక్ విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్

Published : Oct 26, 2021, 01:38 PM IST
భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. కానీ ఇది సమయం కాదు.. టీ20లో భారత్‌పై పాక్ విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్

సారాంశం

భారత్‌తో తమ దేశ సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అదే సమయంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌తో ముడిపెట్టి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.

భారత్‌తో తమ దేశ సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అదే సమయంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌తో ముడిపెట్టి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup) భారత్‌పై తమ దేశం విజయం సాధించిన తర్వాత.. ఈ అంశంపై చర్చించడానికి సరైన సమయం కాదని అన్నారు.  సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. సోమవారం సౌదీ రాజధాని రియాద్‌లో పాకిస్థాన్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌ను ఉద్దేశించి  ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా డాన్ ఆన్‌లైన్ రిపోర్ట్ చేసింది.

‘భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ ఒకటే సమస్య అని..  దీనిని నాగరిక సమాజంలోని పొరుగువారిలా పరిష్కరించుకోవాలి. 72 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చెప్పినట్టుగా ఇది కశ్మీర్ ప్రజల మానవ హక్కులకు సంబంధించినది. వారి హక్కులు వారికి ఇచ్చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. పాకిస్తాన్ మీదుగా మధ్య ఆసియా ప్రాంతాన్ని సులభంగా చేరుకునేందుకు వీలు కలుగుతుంది. పాకిస్తాన్‌కు కూడా పెద్ద మార్కెట్లు చేరువవుతాయి’అని Imran Khan అన్నారు. 

Also read: జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

‘చైనాతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ భారత్‌తో మా సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. గత రాత్రి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ భారత్‌ ఓడించిన తర్వాత భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచడం కోసం మాట్లాడటానికి ఇది మంచి సమయం కాదని నాకు తెలుసు’అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. 

Also read: అమెరికా వెళ్లేవారికి గుడ్ న్యూస్.. విదేశీ ప్రయాణికులకు బైడెన్ ప్రభుత్వం కోవిడ్-19 నూతన మార్గదర్శకాలు ఇవే..

సౌదీ వ్యాపార కమ్యూనిటీని నేను ఆకట్టుకోవాలనుకుంటున్నాను.. కానీ ఆ పరిస్థితులు ఎప్పుడూ అలాగే ఉండవని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించిన మరసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?