మనిషి రక్తంలో పుట్టగొడుగులు ! షాక్ తిన్న డాక్టర్లు.. అసలేం జరిగిందంటే....

By AN TeluguFirst Published Jan 15, 2021, 5:02 PM IST
Highlights

ఓ వ్యక్తి తన శరీరంలోనే పుట్టగొడుగులు పెంచాలని ప్రయత్నించాడు. చివరికి ప్రయత్నం వికటించి ఆస్పత్రి పాలయ్యాడు. డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించి అతని ప్రాణాలు పోకుండా కాపాడారు. ఈ వింత కేసు ‘అకాడమి ఆఫ్ కన్సులేషన్-లియిసన్ సైకియాట్రీ’ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. 

ఓ వ్యక్తి తన శరీరంలోనే పుట్టగొడుగులు పెంచాలని ప్రయత్నించాడు. చివరికి ప్రయత్నం వికటించి ఆస్పత్రి పాలయ్యాడు. డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించి అతని ప్రాణాలు పోకుండా కాపాడారు. ఈ వింత కేసు ‘అకాడమి ఆఫ్ కన్సులేషన్-లియిసన్ సైకియాట్రీ’ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. 

వివరాలు గోప్యంగా ఉంచబడిన ఓ ముప్పై ఏళ్ల వ్యక్తికి బైపోలార్ డిజార్డర్‌ ఉంది. దీనికోసం అతను డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఆ మందులతో విసుగెత్తి.. తన అనారోగ్య సమస్యను త్వరగా పరిష్కరించే ఇతర మార్గాలను అన్వేషించాడు. 

‘సిలోసిబిన్’ అనే మందు మానసిక ఆందోళన దూరం చేస్తుంది. ఇది ఎందులో ఎక్కువగా లభిస్తుందో తెలుసుకొవాలనుకున్నాడు. దీనికోసం నెట్ లో సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో అతడికి 200 రకాల పుట్టగొడుగుల్లో అది ఉంటుందని తెలిసింది.

అయితే పుట్టగొడుగుల్ని ఆహారంగా తింటే తన వ్యాధి నయం కావడానికి చాలా టైం పడుతుందని అనుకున్నాడు. అందుకే వాటిని నేరుగా తన శరీరంలోకి ఎక్కించాలనుకున్నాడు. దీనికోసం ఆ పుట్టగొడుగులను సేకరించి, నీళ్లలో మరిగించి టీ తయారు చేశాడు. ఆ టీని వడకట్టి దాన్ని తన సిరల్లోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు.

ఆ రోజు బాగానే ఉన్నాడు కానీ రెండు రోజుల్లో తీవ్ర అలసటతో అనారోగ్యం బారిన పడ్డాడు. రక్తపు వాంతులు చేసుకున్నాడు. జాండీస్, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. వికారంతో వాంతులు ఎక్కువ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్‌లో చేర్చారు. 

అయితే, ముందు అతడు వైద్యులకు అసలు విషయం చెప్పలేదు. వైద్య పరీక్షల్లో అతడి అవయవాలు పనిచేయడం మానేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో అప్పుడు అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

పుట్టగొడుగుల రసాన్ని నేరుగా రక్తంలోకి ఎక్కించుకోవడం వల్ల పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉండే సైలోసైబ్ క్యూబెన్సిస్ అనే ఫంగస్ అతని రక్తంలో పెరగడం మొదలైనట్లు వైద్యులు కొనుగొన్నారు. పుట్టగొడుగులను మరిగించినప్పుడు అందులో ఫంగస్‌ను నాశనం అయిందనుకున్నాడు అతను. కానీ అది పూర్తిగా అంతం కాలేదు. అతడి శరీరంలోకి వెళ్లి పెరగడం మొదలయ్యాయి. 

దీంతో వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందించి.. శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేశారు. 22 రోజుల చికిత్స తర్వాత బాధితుడు కోలుకున్నాడు. చికిత్సంలో భాగంగా రక్తంలో పుట్టగొడుగులు పెరగకుండా వైద్యులు అతడికి కొన్ని యాంటీ ఫంగల్ డ్రగ్స్ అందించారు. 

click me!