విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డు.. వందేళ్ల వయసులో కోర్టుకు

Published : Oct 08, 2021, 07:17 PM ISTUpdated : Oct 08, 2021, 07:18 PM IST
విచారణకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ గార్డు.. వందేళ్ల వయసులో కోర్టుకు

సారాంశం

జర్మనీలో నాజీ పార్టీ, అడాల్ఫ్ హిట్లర్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. కాన్సంట్రేషన్ క్యాంప్‌లో వేలాది మందిని ఊచకోత కోసిన ఉదంతాలు మానవాళికే మాయని మచ్చగా మిగిలాయి. ఈ క్యాంప్‌లకు గార్డులుగా వ్యవహరించిన ఓ వందేళ్ల వ్యక్తి నేడు జర్మనీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు.  

న్యూఢిల్లీ: ప్రపంచ చరిత్రలోనే చీకటి అధ్యాయానికి సంబంధించిన ఓ కేసు ఇప్పుడు germanyలో విచారణ జరుగుతున్నది. అడాల్ఫ్ హిట్లర్, నాజీ పార్టీ హింసకు పరోక్షంగా తోడ్పడినవారిపై జర్మనీ కోర్టులు విచారణ చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో concentration campకు గార్డుగా పనిచేసిన వందేళ్ల వ్యక్తి ఇప్పుడు దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. బెర్లిన్ బయట నాజీ కాలంలో ఏర్పాటు చేసిన సాక్సెన్‌హాసెన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌నకు జోసెఫ్ ఎస్ గార్డుగా పనిచేశాడు. ఆ క్యాంప్‌లో 3,518 మంది మరణాలకు ఈయన పరోక్షంగా సహకరించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

నాజీ పార్టీ పారామిలిటరీ వింగ్‌లో జోసెఫ్ ఎస్ సభ్యుడు. 1942 నుంచి 1945 మధ్యకాలంలో కాన్సంట్రేషన్ క్యాంప్‌నకు గార్డుగా పనిచేశాడు. ఈ క్యాంప్ 1936లో ప్రారంభమైంది. ఇందులో వేలాది మందిని ఆకలి, రోగాలు, బలవంతపు పనులు, వైద్య ప్రయోగాలు చేసి హతమార్చడంతోపాటు తుపాకులతో కాల్చి, విషవాయువులు ప్రయోగించి, ఉరేసి చంపేశారు.

కాన్సంట్రేషన్ క్యాంపులో ఇలాంటి హత్యలు జరుగుతాయని తెలిసి కూడా ఆయన guard డ్యూటీ చేశారని కోర్టు పేర్కొంది. హోలోకాస్ట్ బాధితులు, వారి కుటుంబాలు నాజీ కాలంలోని అరాచకాలపై దర్యాప్తు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. nazi పాలనకు తెరపడి అటుఇటుగా 76 ఏళ్లు అవుతున్నా, విచారణ దీర్ఘంగా ఆలస్యమైనా ఈ విచారణలతో అప్పటి అకృత్యాలు, ఘోరాలపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే నాజీ కాలం నాటి మౌనమే ఇప్పటికీ కొనసాగవద్దని వారు ఆశిస్తున్నారు. ఇకనైనా వారి దుర్మార్గాలు, హత్యల గురించి మాట్లాడాలని, ఆ మారణహోమంలో బాధితుల పక్షాన మాటలూ వినడానికి ఆస్కారం కల్పించాలని ఇంటర్నేషనల్ ఆశ్విచ్ కమిటీ నేత ఒకరు తెలిపారు.

సాక్సెన్‌హాసెన్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో అనేక అఘాయిత్యాలు ఎదుర్కొని ఏదో రకంగా బయటపడ్డ ఓ వందేళ్ల బాధితుడూ ఈ కేసు trialకు హాజరవడం గమనార్హం. నాజీ కాలంలో హత్యగావించబడిన నా ఆప్తులు, మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం జరుగుతున్న చివరి విచారణ ఇది అని ఆయన అన్నారు.

నాజీ కాన్సంట్రేషన్‌కు కాపలాగా వ్యవహరించిన జాన్ దెంజాంజుక్‌ను విచారిస్తూ 2011లో జర్మనీ court కీలక తీర్పు వెలువరించింది. కాపలాగా ఉన్నవారూ కాన్సంట్రేషన్ క్యాంపుల్లోని హత్యలకు బాధ్యత వహించాలని ఈ తీర్పు పేర్కొంది. నేరుగా హత్యల్లో వారు పాల్గొనకపోయినా, వారిదీ తప్పు ఉన్నదని స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే