వలసదారులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 17 మంది మృతి, పలువురికి గాయాలు.. మెక్సికోలో ఘటన

Published : Feb 21, 2023, 09:21 AM IST
వలసదారులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 17 మంది మృతి, పలువురికి గాయాలు.. మెక్సికోలో ఘటన

సారాంశం

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. 

వెనిజులా, కొలంబియా మధ్య అమెరికా నుంచి వలస వచ్చిన వారిని తీసుకెళ్తున్న బస్సు సెంట్రల్ మెక్సికోలో బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్యూబ్లా రాష్ట్రంలోని అధికారులు తెలిపారని వార్తా సంస్థ ‘రాయిటర్స్’ నివేదించింది.  ఆదివారం మధ్యాహ్నం 45 మంది ప్రయాణికులతో బస్సు ఉత్తరం వైపు వెళ్తుండగా హైవేపై ఈ ప్రమాదం జరిగిందని ప్యూబ్లా అంతర్గత మంత్రి జూలియో హుయెర్టా తెలిపారు.

టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం.. 6.3 తీవ్రతతో తీవ్ర ప్రకంపనాలు.. వణికిపోయిన జనం

ప్రమాదం జరిగిన సమయంలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన మీడియాతో తెలిపారు. మరో 15 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరు మరణించారని చెప్పారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం.. టూర్స్ టురిస్టికోస్ మదీనా అనే ప్రైవేట్ బస్ లైన్ నడుపుతున్న బస్సు దక్షిణ మెక్సికన్ సరిహద్దు నగరం తపాచులా నుండి మెక్సికో సిటీకి వెళ్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, హెల్పర్ తో పాటు 17 మంది చనిపోయారు. 

న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానం.. లండన్‌లో ల్యాండ్..అసలేం జరిగిందంటే..?

అయితే మొత్తం మృతులు, క్షతగాత్రులలో వలసదారుల ఖచ్చితమైన సంఖ్యను ప్యూబ్లా రాష్ట్ర అధికారులు పేర్కొనలేదు. అలాగే మెక్సికో మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఆ సమయంలో ఎలాంటి వ్యాఖ్యను అందించలేదు. కాగా.. వలసదారులు తరచుగా అమెరికా సరిహద్దుకు వెళ్ళే మార్గంలో మెక్సికోను దాటడానికి ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగిస్తారు.

తల్లిని చంపి, శరీరభాగాలను వండుకుతిన్న వ్యక్తికి.. కుమార్తె వివాహానికి హాజరు కావడానికి అనుమతించిన హైకోర్టు..

మృతుల్లో 56 ఏళ్ల కొలంబియన్ వ్యక్తి ఉన్నారని, ప్యూబ్లాలోని ఆసుపత్రిలో ముగ్గురు కొలంబియన్ బాధితులు (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) ఉన్నారని కొలంబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గాయపడని వ్యక్తిని పొరుగు రాష్ట్రం ఓక్సాకాలోని మైగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మృతుల్లో గ్వాటెమాల వాసులు ఎవరూ లేరని గ్వాటెమాల విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న జీపు బోల్తా .. ఐదుగురు మృతి.. 21 మందికి గాయాలు..

బస్సు కంట్రోల్ కాకపోవడమే ఈ ప్రమాదమే కారణమైందని మెక్సికన్ మీడియా పేర్కొంది. మిలెనియో టెలివిజన్ స్టేషన్ షేర్ చేసిన ఫొటోల్లో బస్సు తీవ్రంగా దెబ్బతిన్న భాగాలు కనిపించాయి. కాగా.. గత వారం పనామాలో బస్సు కొండపై నుంచి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డజన్ల కొద్దీ వలసదారులు మృత్యువాత పడ్డారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే