
టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కి.మీ (1.2 మైళ్లు) లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించింది.
అంతకుముందు ఫిబ్రవరి 6న టర్కీ మరియు పొరుగున ఉన్న సిరియాలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఒకట్రెండు రోజుల తర్వాత కూడా చాలాసార్లు తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 45,000 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి.
దాదాపు రెండు వారాల క్రితం సంభవించిన భారీ ప్రకంపనలతో ఇప్పటికే ధ్వంసమైన టర్కీలోని ఆగ్నేయ హటే ప్రావిన్స్‌లో తాజా భూకంపం సంభవించింది. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లో కూడా ప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంప సమయంలో ప్రాణనష్టం వెంటనే నివేదించబడలేదు. కానీ, ఈ ప్రాంతంలోని అనేక భవనాలు దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు.అయితే, టర్కీలోని ఆగ్నేయ హటే ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఇస్తాంబుల్‌కు చెందిన కందిల్లి అబ్జర్వేటరీ తెలిపింది. టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఓక్టే ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. పరిశోధనలు కొనసాగుతున్నాయని, దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని పౌరులను హెచ్చరించారు.
ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపం తరువాత టర్కీలో ఇప్పటికే 6,000 అనంతర ప్రకంపనలను నివేదించబడ్డాయి. ఈ భారీ భూకంపంలో 45,000 మందికి పైగా మరణించినట్టు సమాచారం. రెండు వారాల క్రితం అదే ప్రాంతంలో విధ్వంసకర, ఘోరమైన భూకంపాలు సంభవించిన తర్వాత వాషింగ్టన్ సహాయం చేస్తుందని టర్కీని సందర్శించిన US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ హామీ ఇచ్చిన కొద్దిసేపటికే తాజా భూకంపం గురించి నివేదిక వచ్చింది.
ఫిబ్రవరి 6న టర్కీకి ఆగ్నేయంగా,పొరుగున ఉన్న సిరియాలో బలమైన 7.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది, 45,000 మందికి పైగా మరణించారు. మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆర్థిక వ్యయంతో పాటు బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. టర్కీ-సిరియాకు సహాయం చేసేందుకు భారత్ రెస్క్యూ టీమ్‌ను పంపింది. రెస్క్యూ ఆపరేషన్ ముగించుకుని బృందం తిరిగి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోమవారం ఆయనతో సమావేశమై మాట్లాడారు. టర్కీ, సిరియాలకు సహాయం చేయడానికి భారతదేశం 'ఆపరేషన్ దోస్త్'ను అమలు చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) చివరి బృందం టర్కీ నుంచి తిరిగి వచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆపరేషన్ దోస్త్ కింద టర్కీకి పంపిన చివరి NDRF బృందం తిరిగి వచ్చిందని బాగ్చి ట్వీట్ చేశారు. 151 మంది జవాన్లు , మూడు డాగ్ స్క్వాడ్ బృందాలు టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశాయి.