
న్యూఢిల్లీ: మీడియా మొఘల్, 92 ఏళ్ల రూపర్ట్ మర్దోక్ మరోసారి పెళ్లి, ఆడవారి సహవాసం విషయాలతో వార్తల్లోకి ఎక్కారు. ఇటీవలే ఆయన యాన్ లిస్లీ స్మిత్‌తో చేసుకోవాల్సిన ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే రూపర్ట్ మర్దోక్ 66 ఏళ్ల ఓ మహిళా సైంటిస్టుతో ప్రేమలో ఉన్నట్టు సమాచారం.
92 ఏళ్ల రూపర్ట్ మర్దోక్, 66 ఏళ్ల రిటైర్డ్ సైంటిస్టు ఎలెనా ఝుకోవాతో ఓ నౌకపై ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆయన మరోసారి ప్రేమలో పడి ఉండొచ్చని కొన్ని వర్గాలు డ్రడ్జ్ అనే వెబ్ సైట్‌కు చెప్పాయి. రూపర్ట్ మర్దోక్ మూడో భార్య వెండీ డెంగ్ వీరిద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేసినట్టు తెలిసింది.
66 ఏళ్ల ఎలెనా ఝకోవా తాను మాలిక్యూల్ బయాలజిస్ట్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెడికల్ రీసెర్చ్ యూనిట్‌లో పని చేశారు.
యాన్ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను రూపర్ట్ మర్దోక్ రద్దు చేసుకున్న నెలల వ్యవధిలో ఆయన వేరే మహిళతో కనిపించారు. యాన్ లెస్లీ స్మిత్‌కు దైవంపై మితిమీరిన నమ్మకాలు ఉన్నాయని, వాటితో రూపర్ట్ మర్దోక్ అసంతృప్తికి గురై వేరైనట్టు ఓ పత్రిక పేర్కొంది.
Also Read: Himachal Pradesh: పేకమేడల్లా కూలిపోయిన ఇళ్లు.. షాకింగ్ వీడియో ఇదే
రూపర్ట్ మర్దోక్ తన ముగ్గురు భార్యలకు ఆరుగురు పిల్లలను కన్నారు. 1999 నుంచి 2003 వరకు వెండి డెంగ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నాడు. 1967 నుంచి 1999 వరకు అన్నా మారియా టోర్వ్, 1956 నుంచి 1967 వరకు ప్యాట్రీషియా బూకర్‌లతో వైవాహిక జీవితం గడిపారు.
న్యూస్ కార్ప్ చైర్మన్, సీఈవో అయిన రూపర్ట్ మర్దోక్ 17 బిలియన్ డాలర్ల ఆస్తిపరుడనే అంచనాలు ఉన్నాయి. ఫాక్స్ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, ది న్యూయార్క్ పోస్ట్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థల్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి.