
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరంలో శనివారం సాయంత్రం రెండు స్మగ్లింగ్ బోట్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. దీనిని అమెరికా తీరాల వెలుపల జరిగిన అత్యంత ప్రమాదకరమైన సముద్ర మానవ స్మగ్లింగ్ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనపై శాన్ డియాగో సిటీ లైఫ్‌గార్డ్ చీఫ్ జేమ్స్ గార్ట్‌ల్యాండ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేము ఎనిమిది మందిని కోల్పోయామని చెప్పారు.
సెంట్రల్ మెక్సికోలోని బార్‌లో కాల్పులు.. 10 మంది మృతి, ఐదుగురికి గాయాలు
శనివారం రాత్రి 11:30 గంటలకు శాన్ డియాగో ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులకు ఈ ప్రమాదంపై సమాచారం అందింది. ఓ స్పానిష్ వ్యక్తి ఎమర్జెన్సీ 911కి ఫోన్ చేసి మెక్సికన్ సరిహద్దు సమీపంలోని శాన్ డియాగోలో రెండు పడవలు బోల్తా పడ్డాయని, మొత్తం 23 మంది చిక్కుకుపోయారని తెలిపారు. టోర్రీ పైన్స్ బీచ్‌లో బోల్తా పడిన ఓడలో ఎనిమిది మంది, మరో ఓడలో 15 మంది ఉన్నారని ఆయన చెప్పారు.
రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నప్పుడు, ఎవరూ సజీవంగా కనిపించలేదని గార్ట్‌ల్యాండ్ తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వచ్చేలోపే స్మగ్లర్లు బీచ్ వదిలి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఇందులో చనిపోయిన వారందరూ పెద్దలే అని పేర్కొన్నారు.
మహిళను కిడ్నాప్, హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసి..
తరచూ దక్షిణ, మధ్య అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు రహస్యంగా అమెరికా సరిహద్దులు దాటుతుంటారు. యునైటెడ్ స్టేట్స్ చేరుకోవాలనే ఆశతో వారు తరచుగా అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో కొన్ని సార్లు వలసదారులు మరణిస్తున్నారు. 2021 మే నెలలో శాన్ డియాగోలోని పాయింట్ లోమాలోని కాబ్రిల్లో జాతీయ స్మారక చిహ్నం వద్ద ఇసుక దిబ్బలను ఢీకొని పడవ విరిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అయితే 33 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.