యజమానిని పాము నుంచి కాపాడిన కుక్క.. వీడియో వైరల్..!

Published : Mar 11, 2023, 11:45 AM IST
యజమానిని పాము నుంచి కాపాడిన కుక్క.. వీడియో వైరల్..!

సారాంశం

ఓ కుక్క తమ యజమానిని విష సర్పం నుంచి కాపాడింది.  ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మనుషులకన్నా కూడా కుక్కలు ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. అలా కుక్కలు విశ్వాసం చూపించిన కథలు మీరు చాలా వినే ఉంటారు. ఒక్క పూట భోజనం పెట్టినా  చాలు... యజమానిపై కుక్కలు అమితమైన ప్రేమ చూపిస్తాయి. ఇంటికి కాపలా కాస్తాయి. దొంగలు రాకుండా చూసుకుంటాయి. తాజాగా... ఓ కుక్క తమ యజమానిని విష సర్పం నుంచి కాపాడింది.  ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 దక్షిణాఫ్రికాలో ఒక కుక్క మంచం క్రింద దాక్కున్న ప్రమాదకరమైన మాంబా పాము నుండి దాని యజమానిని రక్షించడం ద్వారా తన ధైర్యాన్ని ప్రదర్శించింది. యజమాని మంచం దగ్గరకు వచ్చిన ప్రతిసారీ కుక్క గట్టిగా అరిచేదట. కుక్క ప్రతిసారీ ఎందుకు అరుస్తోందా అని అతను మంచం కింద చూడగా.. విష సర్పం కనిపించడం గమనార్హం.

 


దక్షిణాఫ్రికాకు చెందిన నిక్ ఎవాన్స్ అనే పాము పట్టేవాడు ఈ భయానక కథనాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. తర్వాత పాముని పట్టుకున్న విషయాన్ని కూడా అతను షేర్ చేయడం గమనార్హం. ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారగా... యజమాని పై కుక్క చూపించిన విశ్వాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ కుక్క పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..