Ukraine Russia crisis: రష్యా దాడుల్లో 70 మంది ఉక్రెయిన్ ఆర్మీ మృతి

Published : Mar 01, 2022, 01:29 PM IST
Ukraine Russia crisis: రష్యా దాడుల్లో 70 మంది ఉక్రెయిన్ ఆర్మీ మృతి

సారాంశం

ఉక్రెయిన్ కు చెందిన ఓఖ్టిర్కాలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేయడంతో 70 మంది ఉక్రెయిన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. గత నెల 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.

కీవ్: రష్యా దాడుల్లో మంగళవారం నాడు 70 మది సైనికులు మరణించారు. ఖార్కివ్, కీవ్ మధ్య ఓఖ్టిర్కాలోని సైనిక స్థావరంపై రష్యా ఆర్మీ దాడికి దిగింది.ఈ దాడిలో ఉక్రెయిన్ కు చెందిన 70 మది సైనికులు మరణించారు.  ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

ఉక్రెయిన్ దేశంలోని ఖార్కివ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు గాను రష్యా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా  బలగాలను ఉక్రెయిన్  నిలువరిస్తుంది.  దీంతో బాంబు దాడులను రష్యా తీవ్రం చేసింది. రాజధాని కీవ్ పట్టణానికి 64 కి.మీ దూరంలో రష్యా సైన్యం భారులు తీరి ఉంది. కీవ్ నగరం వైపు రష్యా దళాలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను పలు దేశాలు  తీవ్రంగా ఖండిస్తున్నాయి.

గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.  satellite తాజా చిత్రాల మేరకు ఉక్రెయిన్ రాజధాని Kviv నగరానికి 64 కి.మీ దూరంలో రష్యా సైన్యం  ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ France అధ్యక్షుడు  ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో మాట్లాడారు. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 

UNO జనరల్ అసెంబ్లీ సమావేశానికి India గైర్హాజరైంది. బెలారస్ లో  సోమవారం నాడు  ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.  జాతీయ భద్రతా సమస్యలపై ఐక్యరాజ్యసమితిలోని 12 మంది రష్యన్ దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది.

ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల నుండి మద్దతు పెరుగుతుంది., బ్రిటన్  నుండి ఆయుధాలు ఉక్రెయిన్ కు భారీగా వస్తున్నాయి. ఫిన్లాండ్ 2500 అసాల్డ్ రైఫిల్స్, 1500 యుద్ధ ట్యాంకులను పంపనుంది. కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రకటించారు.మరో వైపు రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యా కూడా తమపై ఆంక్షలు విధించిన దేశాలపై కౌంటర్ గా ఆంక్షలను విధిస్తుంది.

కీవ్ ను వెంటనే  విడిచి రావాలని భారతీయులను కోరింది కేంద్రం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు కేంద్రం మరింత వేగంగా చర్యలను తీసుకొంటుంది.  ఆపరేషన్ గంగాలో భాగంగా భారత వైమానిక దళం  సీ-17 విమానాలను వినియోగించనుంది. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపాల‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది విద్యార్థులు, భార‌త పౌరులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం 9 ప్రత్యేక విమానాల ద్వారా సుమారు 8 వేల మందికి పైగా తరలించారు

టాక్సీలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో కిలోమీటర్ల మేర  దూరం నడుచుకొంటూ భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు చేరుకొంటున్నారు. చాలా మంది విద్యార్థుల వద్ద తిన‌డానికి తిండి.. తాగ‌డానికి నీళ్లు కూడా లేవు. అలాంటి దారుణ ప‌రిస్థితుల్లోనే కాలిన‌డ‌క‌నే కిలో మీట‌ర్ల మేర న‌డుస్తూ పోలాండ్‌, రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకుంటున్నారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే