Russia Ukraine War: శాంతి చ‌ర్చ‌ల్లో పురోగ‌తి.. కీవ్​ నుంచి రష్యా బ‌లగాల ఉప‌సంహ‌ర‌ణ‌

Published : Mar 30, 2022, 12:13 AM ISTUpdated : Mar 30, 2022, 12:33 AM IST
Russia Ukraine War: శాంతి చ‌ర్చ‌ల్లో పురోగ‌తి.. కీవ్​ నుంచి రష్యా బ‌లగాల ఉప‌సంహ‌ర‌ణ‌

సారాంశం

Russia Ukraine War: ర‌ష్యా- ఉక్రెయిన్ ల వివాదాన్ని పరిష్కరించడానికి మంగళవారం టర్కీలో జరిగిన చర్చల్లో తగినంత పురోగతి సాధించామని ఉక్రెయిన్ అగ్ర సంధానకర్త తెలిపారు. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.  

Russia Ukraine War: గ‌త నెల రోజులు రష్యా- ఉక్రెయిన్ మధ్య సాగిన భీక‌ర‌ పోరుకు ముగింపు ప‌డ‌నుంది. టర్కీలోని ఇస్తాంబుల్​లో ఇరు దేశాల మ‌ధ్య జరిగిన శాంతి చర్చలు విజ‌య‌వంతమ‌య్యాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.

మంగ‌ళ‌వారం.. ట‌ర్కీలోని ఇస్తాంబుల్ వేదిక‌గా జ‌రిగిన చ‌ర్చ‌లు విజ‌య‌వంతమ‌య్యాయి. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నివార‌ణ దిశ‌గా పురోగ‌తి సాధించామ‌ని ఉక్రెయిన్ ప్ర‌తినిధి చెప్పారు. రెండు దేశాల అధ్య‌క్షుల‌ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల‌కు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం మార్గం సుగ‌మ‌మైంద‌న్నారు. 

ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా.. ఉక్రెయిన్ భ‌ద్ర‌త‌కు అంత‌ర్జాతీయంగా హామీ కావాల‌ని ఉక్రెయిన్ ప్ర‌తినిధులు ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. త‌ద‌నుగుణంగా కీవ్‌తోపాటు చెర్నీహివ్ న‌గ‌రాలు ఇత‌ర ప్రాంతాల నుంచి బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రిస్తామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది.

ఉక్రేనియన్ దళాలు కీలకమైన కైవ్ శివారు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయనీ, దేశ రాజ‌ధాని ఉక్రెయిన్ స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్న ఉక్రెయిన్ సేన‌లు.. మ‌రియాపోల్‌పై నియంత్ర‌ణ కోసం పోరాడుతున్నాయి.  రష్యా నియంత్రణ నుండి రాజధాని వాయువ్యానికి కీలకమైన గేట్‌వేని స్వాధీనం చేసుకున్నామ‌ని ఉక్రెయిన్ అంత‌రంగిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డెనీస్ మొనాస్టైర్‌స్కై చెప్పారు.

ఇర్పిన్‌పై ప‌ట్టు కోల్పోవ‌డం ర‌ష్యాకు ఎదురు దెబ్బేన‌ని ప‌శ్చిమ దేశాల నిపుణులు అంటున్నారు. అయితే, తిరిగి ప‌ట్టు సాధించేందుకు ర‌ష్యా బ‌ల‌గాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. భ‌ద్ర‌త‌పై హామీ కోసం ఉక్రెయిన్ త‌మ‌కు త‌ట‌స్థ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌తిపాదిస్తున్న‌ది. అంటే అది సైనిక పొత్తులు లేదా సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇవ్వదని ఉక్రెయిన్ సంధానకర్తలు తెలిపారు.  అలాగ‌ని తాము నాటో కూట‌మిలో చేర‌బోమ‌ని చెబుతున్న‌ది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ట్యాంకులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి, కైవ్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని లేదా తొలగించాలని ఆశించి ఇప్పుడు ఒక నెల కన్నా ఎక్కువ.

ఉక్రెయిన్ ఒక అంతర్జాతీయ ఒప్పందం కోసం పిలుపునిచ్చింది, దీని ప్రకారం ఇతర దేశాలు NATO సైనిక కూటమి యొక్క ఆర్టికల్ 5 ప్రకారం దాని భద్రతకు హామీ ఇస్తాయి. పోలాండ్, ఇజ్రాయెల్, టర్కీ మరియు కెనడా సంభావ్య భద్రతా హామీదారులలో ఉండవచ్చు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !