Russia-Ukraine war: శాంతి చర్చల్లో కీలక పరిణామం.. ఆ రెండు నగరాలలో బలగాలను తగ్గిస్తామన్న రష్యా

Siva Kodati |  
Published : Mar 29, 2022, 06:34 PM ISTUpdated : Mar 29, 2022, 06:35 PM IST
Russia-Ukraine war: శాంతి చర్చల్లో కీలక పరిణామం.. ఆ రెండు నగరాలలో బలగాలను తగ్గిస్తామన్న రష్యా

సారాంశం

రష్యా - ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల సమీపంలో తమ యుద్ధ కార్యకలాపాలను ప్రాథమికంగా తగ్గించుకునేందుకు రష్యా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది  

ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు (russia ukraine war)  నెల రోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. కానీ రష్యా అంచనాలు పూర్తిగా తప్పాయి. అనుకున్నంత సులభంగా ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం అసాధ్యమనే విషయం రష్యాకు అర్ధమైనట్లుగా కనిపిస్తోంది. అయినా పట్టు వీడటం లేదు మాస్కో. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు అత్యాధునిక ఆయుధాలను సైతం ప్రయోగిస్తోంది. అటు దక్షిణ ఉక్రెయిన్ సీటిలోని విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో రష్యా సేనలు 12వసారి కూడా విఫలమైయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్‌కు సమీపంలోని ఇర్ఫిన్ ప్రాంతంపై ఉక్రెయిన్ బలగాలు తిరిగి పట్టు సాధించాయని స్థానిక మేయర్ ప్రకటించారు. అయితే ఖార్కివ్, మరియాపోల్‌పై రష్యా విధ్వంసకాండను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 

రష్యా విధ్వంసకాండతో ఉక్రెయిన్‌లో పలు బలగాలు నేలమట్టమయ్యాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌కు ఇప్పటి వరకు 43 లక్షల కోట్ల మేర నష్టం సంభవించింది. ఐదు లక్షల మంది నివసించే మరియపోల్ నగరాన్ని బూడిదగా మార్చేశారని తెలిపింది ఉక్రెయిన్. ఇప్పటి వరకు మరియుపోల్‌లో ఐదు వేల మంది మరణించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల్లో (russia ukraine peace talks) కీలక పరిణామం చోటు చేసుకుంది. కీవ్, చెర్నిహివ్ (Kyiv, Chernihiv) ప్రాంతాల సమీపంలో తమ యుద్ధ కార్యకలాపాలను ప్రాథమికంగా తగ్గించుకునేందుకు రష్యా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేవలం మిలిటరీ స్థావరాలను మాత్రమే కాదు.. సాధారణ పౌరులనూ వారు లక్ష్యం చేసుకుంటున్నారు. అంతేకాదు, మహిళలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మహిళ తన ఆవేదనను ఓ మీడియా సంస్థకు వెల్లడించడంతో ఈ విషయం తెలిసింది. ఇద్దరు రష్యా జవాన్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. 

‘‘‘ తాను ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి బయట గేటు దగ్గర భారీ శబ్దం వినిపించింది. ఆ తర్వాత గేటు తెరిచిన శబ్దాలు వచ్చాయి. దాని వెంటనే కొందరు నడుచుకుంటూ వడిగా తమ ఇంటి వైపు వస్తున్నట్టు చప్పుళ్లు వినిపించాయి’ అని ఆ మహిళ జరిగిన దుర్ఘటన గురించిన విషయాలను పంచుకున్నారు. ముందు వారు తమ పెంపుడు కుక్కను చంపేశారని వివరించారు. ఆ తర్వాత నేరుగా తమ భర్తను గురి చేసుకుని కాల్చి చంపేశారని తెలిపారు. తన భర్త అరుపు వినిపించిందని, వెంటనే తాను బయటకు వేగంగా పరిగెత్తానని పేర్కొన్నారు. ‘ఏడ్చుకుంటూనే నా భర్త ఎక్కడ? నా భర్త ఎక్కడ? అంటూ వారిని ప్రశ్నించా’ అని వివరించారు. ఆ తర్వాత వెలుపల వైపు చూశానని, అక్కడ గేటు సమీపంలోనే తన భర్త శవం కనిపించిందని తెలిపారు. ఆ మిలిటరీ జవాన్లలో ఒక యువకుడు తన వైపు గన్ గురి పెట్టి.. ‘నీ భర్త నాజీ. కాబట్టి ఆయన్ని చంపేశాను’ అని జవాన్లు ఆ మహిళకు సమాధానం ఇచ్చారని చెప్పారు.

‘ఆ తర్వాత వారి గురి నాపైకి మళ్లింది. అందులో ఒకడు నాకు దగ్గరగా వచ్చి దుస్తులు విప్పేయాల్సిందిగా ఆదేశించాడు. నేను ఏడుపు ఆపకుంటే గుళ్లతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. పుచ్చ పేలిపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. అందుకే నోరు మూయాలని అన్నాడు. లేదంటే.. ఆ తర్వాత నా కొడుకును ఇక్కడికి తీసుకువచ్చి.. ఇళ్లంతా చెల్లా చెదురుగా పడ్డ బ్రెయిన్‌ను చూపిస్తామని బెదిరించాడు. ఆ తర్వాత నా దుస్తులు విప్పేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. నా కొడుకు బాయిలర్ రూమ్‌లో కన్నీరు మున్నీరు అవుతున్నది వారు పట్టించుకోలేదు. గన్ గురిపెట్టే నా కొడుకు నోరుమూసి రావాల్సిందిగా నన్ను ఆదేశించారు. వారు నా తలపై గన్ పాయింట్ చేసే ఉంచారు. అంతేకాదు, ఇంతకూ ఈమెను చంపేయాలా? వదిలేయాలా? అంటూ ఇద్దరూ జోకులు వేసుకున్నారు’ అని ఆమె వాపోయారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే